ప్రభుత్వ రంగ సంస్థ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిపాజిట్లను ఆకట్టుకోవడానికి ప్రత్యేక డిపాజిట్ స్కీంను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. 333 రోజుల కాలపరిమితితో యూనియన్ సమృద్ధి స్కీంపై అధిక వడ్డీరేటును ఆఫర్ చేస్తున్నది బ్యాంక్. ఈ స్కీంలో కనీసంగా రూ.1,000 నుంచి రూ.3 కోట్ల లోపు డిపాజిట్ చేయవచ్చును. ఈ స్కీంపై సాధారణ ప్రజలకు 7.40 శాతం వార్షిక వడ్డీని చెల్లిస్తున్న బ్యాంక్..సీనియర్ సిటిజన్లకు 7.90 శాతం, సూపర్ సీనియర్ సిటిజన్లకు 8.15 శాతం వడ్డీని ఆఫర్ చేస్తున్నది బ్యాంక్. మెచ్యూర్ కాకముందే ఈ డిపాజిట్లను విత్డ్రా చేసుకునే అవకాశాన్ని బ్యాంక్ కల్పించింది. కానీ, ఇలా చేసుకుంటే ఒక్క శాతం వడ్డీని తగ్గి చెల్లించనున్నది. ఈ డిపాజిట్ స్కీంను ఎంచుకోవడానికి బ్యాంక్ శాఖ లేదా వెబ్సైట్ ద్వారా డిపాజిట్ చేయవచ్చును.