Yamaha | న్యూఢిల్లీ, సెప్టెంబర్ 25: ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ యమహా ..ప్రస్తుత పండుగ సీజన్లో కొనుగోలుదారులను ఆకట్టుకోవాలనే ఉద్దేశంతో ప్రత్యేక ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఎఫ్‌జెడ్ సిరీస్, ఫ్యాసినో, రే జెడ్ఆర్ మాడల్స్పై రూ.7 వేల వరకు క్యాష్‌బ్యాక్‌ను అందిస్తున్నది. దీంతోపాటు హైబ్రిడ్ స్కూటర్లను డౌన్‌పేమెంట్ కింద రూ.2,999, అలాగే ఎఫ్‌జెడ్ సిరీస్ బైకులను రూ.7,999 చెల్లించి కొనుగోలు చేయవచ్చునని కంపెనీ వర్గాలు వెల్లడించాయి.