Ola Electric | ఓలా’ భవిష్ అగర్వాల్‌కు షాక్.. ఇద్దరు క్లోజ్ అసోసియేట్స్ రాజీనామా.. అసలేమైంది..?!
Ola Electric | ఓలా ఎలక్ట్రిక్ ఫౌండర్ కం సీఈఓ భవిష్ అగర్వాల్ కు అత్యంత సన్నిహితులైన ఇద్దరు సీనియర్ ఎగ్జిక్యూటివ్ లు శ్లోకార్త్ దాస్, సౌరబ్ శార్దా కంపెనీ నుంచి వైదొలిగారు.
Ola Electric | దేశంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ టూ వీలర్స్ వెహికల్స్ తయారీ సంస్థ ‘ఓలా ఎలక్ట్రిక్’ ఫౌండర్ కం సీఈఓ భవిష్ అగర్వాల్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఓలా ఎలక్ట్రిక్ ప్లానింగ్ అండ్ స్ట్రాటర్జీ హెడ్ శ్లోకార్త్ దాస్, పార్టనర్ షిప్స్ అండ్ కార్పొరేట్ ఎఫైర్స్ హెడ్ సౌరబ్ శర్దా రాజీనామా చేశారు. వారిద్దరూ శనివారమే రాజీనామా చేసినట్లు సమాచారం.
ఏడెనిమిదేండ్లుగా శ్లోకార్త్ దాస్ కంపెనీలో పని చేస్తున్నారు. శ్లోకార్త్, సౌరబ్ శార్దాలిద్దరూ భవిష్య్ అగర్వాల్‌కు అత్యంత సన్నిహితులని తెలుస్తున్నది. శ్లోకార్త్, సౌరబ్ రాజీనామాలపై ఓలా అధికార ప్రతినిధి స్పందించారు. ఏడేండ్లకు పైగా శ్లోకార్త్, సౌరబ్ కంపెనీ ఎదుగుదలకు ఎంతో క్రుషి చేశారని కొనియాడారు. వారి భవిష్యత్ ప్రణాళికలు విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.
ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన, అత్యంత అనుభవం గల నాయకత్వ టీం తమకు ఉందని ఓలా అధికార ప్రతినిధి తెలిపారు. టెస్లా, ఆపిల్, ఎల్జీ వంటి గ్లోబల్ దిగ్గజ సంస్థలతోపాటు భారతీయ కంపెనీల నుంచి 50 మందికి పైగా ప్రముఖులను గత ఏడాది కాలంగా నియమించుకున్నామని తెలిపారు.
టెక్నాలజీ భవిష్యత్‌కు భారత్ హబ్‌గా నిలుస్తుంది. అంతర్జాతీయంగా ఎంతో ప్రతిభావంతులైన నిపుణులు తమ వంటి నూతన తరం కంపెనీల్లో చేరేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని ఓలా అధికార ప్రతినిధి అన్నారు. ఇదిలా ఉంటే శ్లోకార్త్, సౌరబ్లతోపాటు మరో ఇద్దరు సీనియర్ స్థాయి ఎగ్జిక్యూటివ్‌లు త్వరలో కంపెనీ నుంచి వైదొలగున్నారని వార్తలొస్తున్నాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

