Demand fo SUVs | ఎస్యూవీ కార్లంటేనే మోజు.. హ్యాచ్‌బ్యాక్‌లకు తగ్గిన గిరాకీ
Demand fo SUVs | గత ఐదు నెలల్లో జరిగిన కార్ల విక్రయాల్లో ప్రతి ఐదింటిలో రెండు ఎస్యూవీ కార్లేనని తేలింది.
Demand fo SUVs | జనవరి నుంచి మార్చి వరకు ఐదు నెలల్లో జరిగిన ప్రతి ఐదు కార్ల కొనుగోళ్లలో రెండు ఎస్యూవీలేనని తేలింది. ఏడేండ్ల క్రితం 2015లో దాదాపు సగం మంది హ్యాచ్ బ్యాక్ కార్లకు కస్టమర్లు ప్రాధాన్యం ఇచ్చేవారు. కస్టమర్ల నుంచి వస్తున్న డిమాండ్‌కు అనుగుణంగా ఫీచర్ రిచ్ ఎంట్రీ లెవెల్ ఎస్యూవీ కార్లను తయారు చేసేందుకు కార్ల తయారీ సంస్థలు సిద్ధం అవుతున్నాయి. తద్వారా భారత్ ఆటోమొబైల్ మార్కెట్ ఎస్‌యూవీల మార్కెట్‌గా అవతరించనున్నది.
కార్ల మార్కెట్లో లీడర్లు కొనసాగుతున్న మారుతి సుజుకి.. న్యూ వర్షన్ బ్రెజా, హ్యుండాయ్ మోటార్స్ ఇండియా.. వెన్యూ ఫేస్‌లిఫ్ట్ ఇటీవలే ఆవిష్కరించాయి. తద్వారా ఎస్యూవీ మోడల్ కార్ల విభాగంలో తమ మార్కెట్‌ను బలోపేతం చేసుకోవాలని మారుతి, హ్యుండాయ్ నిర్ణయానికి వచ్చాయి. 2021లో ఎంట్రీ లెవెల్ 6.38 లక్షల ఎస్యూవీ కార్లు అమ్ముడయ్యాయి. 2020, 2021లో ఎస్యూవీ కార్ల తయారీలో హ్యుండాయ్దే ఆధిపత్యం. తర్వాతీ స్థానంలో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ మోడల్ కార్లు 3.65 లక్షలు ఉన్నాయి.
జనవరి నుంచి మే మధ్య విక్రయించిన కార్లలో 41 శాతం ఎస్‌యూవీలు ఉన్నాయి. 2014-15 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 13.5 శాతం పెరిగాయి. ఇదే సమయంలో హ్యాచ్‌బ్యాక్ మోడల్ కార్ల విక్రయాలు 49 శాతం నుంచి 35 శాతానికి పడిపోయాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

