Twitter CEO | మస్క్ నిర్ణయం కరెక్టే.. ట్విట్టర్ బలోపేతానికేనన్న సీఈఓ
Twitter CEO | ట్వీట్ల వీక్షణకు పరిమితులు విధిస్తూ ఎలన్ మస్క్ తీసుకున్న నిర్ణయం సబబేనని సంస్థ సీఈఓ లిండా యకారినో పేర్కొన్నారు.
Twitter CEO | ట్విట్టర్ అధినేత ఎలన్‌మస్క్ తీసుకున్న నిర్ణయాన్ని ఆ సంస్థ సీఈఓ లిండా యకారినో సమర్థించారు. యూజర్లు ట్వీట్లను వీక్షించడానికి పరిమితి విధిస్తూ ఎలన్‌మస్క్ నిర్ణయించారు. ట్విట్టర్‌ను బలోపేతం చేయడానికి మస్క్ నిర్ణయం చేయూతనిస్తుందని మంగళవారం ట్వీట్ చేశారు. ఎలన్‌మస్క్ నిర్ణయంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో సీఈఓ లిండా యకారినో ఈ ట్వీట్ చేయడం గమనార్హం.
ట్విట్టర్లో ఫేక్ ఖాతాలను నియంత్రించడానికే ఎలన్‌మస్క్ ఈ నిర్ణయం తీసుకున్నారని లిండా యకారినో చెప్పుకొచ్చారు. తాజా నిర్ణయం వల్ల సాధారణ ట్విట్టర్ యూజర్లపై ప్రభావం చూపదని అభిప్రాయ పడ్డారు. ట్వీట్ల వీక్షణకు పరిమితులు విధిస్తూ ఎలన్‌మస్క్ నిర్ణయం తీసుకున్న మూడు రోజులకు సీఈఓ లిండా యకారినో ట్వీట్ చేయడం ఆసక్తికర పరిణామం.
శనివారం రాత్రి ట్విట్టర్ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తమ ట్వీట్లు చూడలేకపోతున్నామంటూ పలువురు యూజర్లు ఫిర్యాదులు చేశారు. నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీంతో ట్విట్టర్లో పోస్టుల వీక్షణకు పరిమితులు విధిస్తున్నామని ఎలన్‌మస్క్ వెల్లడించారు. ఎలన్‌మస్క్ నిర్ణయంతో ట్విట్టర్ భవితవ్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ పరిస్థితుల్లో ట్విట్టర్‌కు పోటీగా ఫేస్బుక్ మాతృసంస్థ త్వరలో `థ్రెడ్స్` అనే యాప్ తీసుకు రానున్నట్లు సంకేతాలిచ్చింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

