TVS Apache RTR 310 | ప్రముఖ టూ వీలర్స్ తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ సెప్టెంబర్ ఆరో తేదీన తన అపాచీ ఆర్టీఆర్ 310 (TVS Apache RTR 310) మోటారు సైకిల్ ఆవిష్కరించనున్నది. ఇప్పటికే ఈ బైక్‌పై ఆసక్తి గల వారు రూ.3100 చెల్లించి ప్రీ బుకింగ్స్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఈ మోటారు సైకిల్.. బీఎండబ్ల్యూ జీ 310, కేటీఎం 390 డ్యూక్ బైక్ లతో పోటీ పడుతుంది. దీని ధర సుమారు. 2.5 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభం అవుతుందని అంచనా వేస్తున్నారు.
టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 310 బైక్.. 313సీసీ, లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 33.52 బీహెచ్పీ విద్యుత్, 28 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది. 6-స్పీడ్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్‌తో వస్తున్నది. రీ డిజైన్డ్ 17-అంగుళాల అల్లాయ్ వీల్స్, ట్యూబులర్ ఫ్రేమ్, స్ప్లిట్ సీట్ సెటప్, రేర్ టర్న్ ఇండికేటర్లు తదితర ఫీచర్లు ఉంటాయి.
ఎల్ఈడీ సెటప్ గల బీఫీ హెడ్‌లైట్, గోల్డెన్ ఫినిష్ యూఎస్డీ ఫ్రంట్ టెలిస్కోపిక్ ఫోర్క్స్, అప్ డేటెడ్ ఓఆర్వీఎంస్, రెక్ట్యాంగులర్ ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, డబుల్ ఫాక్స్ వైండ్ స్క్రీన్, రేర్ సబ్ ఫ్రేమ్, తదితర ఫీచర్లు ఉన్నాయి. ఫ్రంట్ అండ్ రేర్ వీల్స్ పై పెటల్ డిస్క్ బ్రేక్స్ విత్ డ్యుయల్ చానెల్ ఏబీఎస్ సిస్టమ్, అడ్జస్టబుల్ బ్రేక్ అండ్ క్లచ్ లివర్స్, టీఎఫ్టీ డిస్ ప్లే కింద ఫలు ఫీచర్లు జత చేశారు.