TVS Raider iGo | ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ టీవీఎస్ మోటార్స్ తన టీవీఎస్ రైడర్ ఐగో (TVS Raider iGo) మోటారు సైకిల్‌ను భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. దీని ధర రూ.98,389 (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభం అవుతుంది. టీవీఎస్ రైడర్ మోటారు సైకిళ్ల విక్రయాలు పది లక్షల మార్కుకు చేరుకున్న నేపథ్యంలో టీవీఎస్ రైడర్ ఐగో (TVS Raider iGo) మోటారు సైకిల్ తీసుకొచ్చింది. ఆరు మోటారు సైకిళ్ల టీవీఎస్ రైడర్ లైనప్‌లో నాలుగో స్థానంలో నిలుస్తుంది.
టీవీఎస్ రైడర్ ఐగో (TVS Raider iGo) మోటారు సైకిల్ 124.8 సీసీ ఆయిల్ కూల్డ్, ట్రిపుల్ వాల్వ్, సింగిల్ సిలిండర్ ఇంజిన్ తో వస్తుంది. ఈ ఇంజిన్ దాదాపు 7500 ఆర్పీఎం వద్ద 11.2 బీహెచ్పీ విద్యుత్, 6000 ఆర్పీఎం వద్ద 11.7 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. అర్బన్ యూజర్ల కోసం డిజైన్ చేసిన టీవీఎస్ రైడర్ ఐగో 5-స్పీడ్ ట్రాన్స్మిషన్ ఆప్షన్ కలిగి ఉంటుంది. ఐగో అసిస్ట్ (iGo assist) టెక్నాలజీతో టీవీఎస్ రైడర్ ఐగో మోటారు సైకిల్ వస్తుంది. టీవీఎస్ రైడర్ మోటారు సైకిల్ మాదిరిగానే రైడర్ ఐగో బైక్ లోనూ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్, ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్, కమ్యూటర్ స్టైల్ రైడింగ్ పొజిషన్ లో స్ప్లిట్ సీటు ఉంటుంది. అల్లాయ్ వీల్స్ మీద బ్రైట్ రెడ్ పెయింట్, నార్డో గ్రే కలర్ లో మోటారు సైకిల్ వస్తుంది.
టీవీఎస్ రైడర్ ఐగో (TVS Raider iGo) మోటారు సైకిల్ టీవీఎస్ కనెక్ట్ యాప్ ద్వారా స్మార్ట్ ఎక్స్ కనెక్ట్‌తోపాటు రైడర్ ఐగో మోటారు సైకిల్ యాక్సెస్ చేయొచ్చు. టర్న్ బై టర్న్ నేవిగేషన్, కాల్ హ్యాండ్లింగ్, నోటిఫికేషన్ మేనేజ్ మెంట్‌కు మద్దతుగా రివర్స్ ఎల్సీడీ క్లస్టర్ ఉంటుంది. మొబైల్ యాప్ లో వాయిస్ అసిస్ట్ కూడా ఉంటుంది. యాప్ ద్వారా రైడ్ డిటైల్స్, బైక్ ఓవర్ వ్యూ, లైవ్ డాష్ బోర్డ్ తదితర వివరాలు ఉంటాయి. ఫైవ్ స్టెప్ అడ్జస్టబిలిటీతోపాటు గ్యాస్ చార్జిడ్ మోనో షాక్, టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్ ఉంటాయి. 240 ఎంఎం డిస్క్ ఫ్రంట్ బ్రేక్, రేర్ డ్రమ్ బ్రేక్ ఉంటాయి.