బెంగళూరు, సెప్టెంబర్ 4: ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ టీవీఎస్ మార్కెట్లోకి మరో స్కూటర్‌ను పరిచయం చేసింది. హైపర్ స్కూటర్ మాడల్ ఎంటార్క్ 150ని ప్రవేశపెట్టింది. ఈ స్కూటర్ ప్రారంభ ధర రూ.1.19 లక్షలు కాగా, గరిష్ఠ ధర రూ.1.29 లక్షలు. ఈ ధరలు బెంగళూరు షోరూంనకు సంబంధించినవి.
149.7 సీసీ ఇంజిన్‌తో తయారైన ఈ స్కూటర్లో లెడ్ డీఆర్ఎల్ఎస్, డిస్క్ బ్రేక్, సింగిల్ చానెల్ ఏబీఎస్ కంట్రోల్, సింగిల్ సిలిండర్ ఇంజిన్ కలిగిన ఈ స్కూటర్ గంటకు 104 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోనున్నది.