TVS Apache RR 310 | అదిరిపోయే ఫీచర్లతో మార్కెట్లోకి టీవీఎస్ న్యూ అపాచీ ఆర్టీఆర్ 310.. ఇవీ డిటైల్స్..!
TVS Apache RTR 310 | ప్రముఖ టూ వీలర్స్ కంపెనీ టీవీఎస్ మోటార్స్.. దేశీయ మార్కెట్లోకి సరికొత్త మోటారు సైకిల్ టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 310 ఆవిష్కరించింది. దీని ధర రూ.2.43 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది.
TVS Apache RR 310 | ప్రముఖ టూ వీలర్స్ తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ (TVS Motor Company) భారత్ మార్కెట్లో తన టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 310 (TVS Apache RTR 310) బైక్ ఆవిష్కరించింది. పాపులర్ నాక్డ్ వర్షన్ బైక్‌గా పేరొందిన టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 310 (TVS Apache RTR 310) ధర రూ.2.43 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభం అవుతుంది. ఇప్పటికే ఈ బైక్ ప్రీ -బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. స్ప్లిట్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్, ఫ్లాట్ హ్యాండిల్ బార్ తదితర ఫీచర్లతో వస్తున్నది. న్యూ టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 310 బైక్.. బీఎండబ్ల్యూ జీ310 ఆర్, ట్రయంఫ్ స్పీడ్ 400, హార్లీ డేవిడ్సన్ ఎక్స్440, బజాజ్ డామినర్ 400 మోటారు సైకిళ్లతో పోటీ పడుతుంది.
న్యూ టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 310 (TVS Apache RTR 310) బైక్ మూడు వేరియంట్లలో (రెండు కలర్ ఆప్షన్లు) లభిస్తుంది. ఆర్సెనల్ బ్లాక్ విత్ఔట్ క్విక్ షిఫ్టర్ ధర రూ.2.43 లక్షలు (ఎక్స్ షోరూమ్ ధర), ఆర్సెనల్ బ్లాక్ రూ.2.58 లక్షలు (ఎక్స్ షోరూమ్), ఫర్రీ ఎల్లో ధర రూ.2.64 లక్షలు (ఎక్స్ షోరూమ్) పలుకుతుంది. క్లైమేట్ కంట్రోల్ సీట్స్, ఇన్ స్టంట్ కూలింగ్, మూడు నిమిషాల్లో హీటింగ్ కెపాసిటీ ఉంటుంది.
న్యూ టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 310 (TVS Apache RTR 310) బైక్ లిక్విడ్ కూల్డ్ 312 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 34 హెచ్‌పీ, 27.3 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది. 6-స్పీడ్ గేర్ బాక్స్‌తో పని చేస్తుంది. టీవీఎస్ అపాచీ ఆర్ఆర్ 310 (TVS Apache RR 310), బీఎండబ్ల్యూ జీ310 ఆర్ (BWM G 310 R) వంటి మోటారు సైకిళ్లను పోలి ఉంటుంది.
గత నెలలో టీవీఎస్ మోటార్ కంపెనీ ‘ఎక్స్’ ఎలక్ట్రిక్ స్కూటర్ని ఆవిష్కరించింది. బ్లూ టూత్ కనెక్టివిటీ, 10.2 అంగుళాల పనోరమిక్ డాష్ బోర్డుతో వస్తుందీ ఎలక్ట్రిక్ స్కూటర్. దీని ధర రూ.2.49 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

