న్యూఢిల్లీ, మే 17: ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ టీవీఎస్ కీలక నిర్ణయం తీసుకున్నది. తన ఎలక్ట్రిక్ స్కూటర్ మాడల్ ఐక్యూబ్ ధరను భారీగా తగ్గించింది. బ్యాటరీ కెపాసిటీని పెంచడంతోపాటు ధరను రూ.26 వేల వరకు దించింది. ఐక్యూబ్, ఐక్యూబ్ ఎస్ మాడళ్ల ధరలను రూ.16 వేలు తగ్గించిన సంస్థ..ఐక్యూబ్ ఎస్టీ మాడళ్లను రూ.26 వేలకు తగ్గించింది.
దీంతో ఐక్యూబ్ స్కూటర్ ప్రారంభ ధర రూ.1.31 లక్షలకు దిగిరాగా, గరిష్ఠ ధర రూ.1.59 లక్షలకు తగ్గింది. ఈ ధరలు వెంటనే అమలులోకి రానున్నట్లు పేర్కొంది. అలాగే బ్యాటరీ కెపాసిటీని 3.4 కిలోవాట్ల నుంచి 3.5 కిలోవాట్లకు పెంచిన సంస్థ..మరో మాడల్‌ను 5.1 కిలోవాట్ల నుంచి 5.3 కిలోవాట్లకు పెంచింది. సింగిల్ చార్జింగ్‌తో ఐక్యూబ్ ఎస్ మాడల్ 145 కిలోమీటర్లు, ఐక్యూబ్ ఎస్టీ మాడల్ 212 కిలోమీటర్లు ప్రయాణించనున్నది.