చెన్నై, జూలై 10: టీవీఎస్ అపాచీ 2024 ఆర్టీఆర్ 160 రేసింగ్ ఎడిషన్‌గా మళ్లీ మార్కెట్లోకి విడుదల చేసింది. ఢిల్లీ షోరూంలో ఈ బైకు ధర రూ.1.28 లక్షలుగా నిర్ణయించింది. రేసింగ్ ఎడిషన్‌గా విడుదల చేసిన ఈ బైకును నూతన ప్రమాణాలకు లోబడి తీర్చిదిద్దినట్లు, ముఖ్యంగా పనితీరు మెరుగుపరిచినట్లు, అడ్వాన్స్ ఫీచర్స్‌తో తయారు చేసినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.