న్యూఢిల్లీ, జూన్ 28: టీవీఎస్ మరో స్పోర్ట్స్ బైకును దేశీయ మార్కెట్‌కు పరిచయం చేసింది. అపాచీ బ్రాండ్‌లోనే ఆర్టీఆర్ 160 పేరుతో ఈ నయా మాడల్‌ను తీసుకొచ్చింది. ఈ బైకు ప్రారంభ ధర రూ.1.34 లక్షలుగా నిర్ణయించింది. రెండు రంగుల్లో లభించనున్న ఈ బైకు గతేడాది అందుబాటలోకి తీసుకొచ్చిన టాప్-ఎండ్ మాడల్ కంటే రూ.4 వేలు అధికం. డ్యూయల్-చానెల్ ఏబీఎస్ సిస్టమ్‌తో ఆధునీకరించిన తొలి బైకు ఇదే . 159.7 సీసీ ఇంజిన్‌తో తయారైన ఈ బైకు 16.04 పీఎస్‌ల శక్తిని, 5 స్పీడ్ గేర్‌బాక్స్, బ్లూటూత్ కనెక్టివిటీ, నావిగేషన్ సిస్టమ్‌తో అనుసంధానం చేసుకునే విధంగా డిజైన్ చేసినట్టు టీవీఎస్ మోటర్ బిజినెస్ హెడ్ విమల్ సౌంబ్లీ తెలిపారు.