చెన్నై, మే 17: దేశవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన అపాచీ 160 ఆర్టీఆర్ను బ్లాక్ ఎడిషన్‌గా మళ్లీ విడుదల చేసింది టీవీఎస్ మోటర్ సంస్థ. నూతన శ్రేణి టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 సిరీస్‌ని రూ.1,09, 990 విక్రయించనున్న సంస్థ..అపాచీ ఆర్టీఆర్ 160 4 వాల్వ్యూ ధరను రూ.1,19,990గా నిర్ణయించింది.
గత నాలుగు దశాబ్దాలుగా స్పోర్ట్స్ బైకు విభాగంలో అగ్రగామిలో దూసుకుపోతున్న అపాచీ.. అంతర్జాతీయంగా ఇప్పటి వరకు 55 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి. ప్రస్తుతం ఇదే బైకును బ్లాక్ ఎడిషన్‌గా మళ్లీ అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.