చెన్నై, ఏప్రిల్ 18: ద్విచక్ర వాహన సంస్థ టీవీఎస్…దేశీయ మార్కెట్‌కి సరికొత్త బైకును పరిచయం చేసింది. 2025 ఎడిషన్‌గా విడుదల చేసిన సూపర్ ప్రీమియం మోటర్‌సైకిల్ అపాచీ ఆర్ఆర్310 మాడల్ రూ.2,77,999 ప్రారంభ ధరతో లభించనున్నది. దేశీయ మార్కెట్లోకి అపాచీ బ్రాండ్ అడుగుపెట్టి 20 ఏండ్లు పూర్తైన సందర్భంగా విడుదల చేసిన ఈ మాడను ప్రత్యేక ఎడిషన్‌గా అందుబాటులోకి తీసుకొచ్చినట్టు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.
ఇప్పటి వరకు దేశీయంగా 60 లక్షల కస్టమర్లు ఉన్నారు. 310 సీసీ ఇంజిన్ సామర్థ్యంతో తయారైన ఈ మాడల్ 38 హెచ్‌పీ సామర్థ్యం ఇవ్వనున్నది.