న్యూయార్క్, నవంబర్ 23: ప్రపంచ కుబేరుడిగా వెలుగొందుతున్న టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సంపదకు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం బాగా కలిసొచ్చింది. ట్రంప్ గెలిచిన దగ్గర్నుంచి మస్క్ ఆస్తుల విలువ ఏకంగా 70 బిలియన్ డాలర్లు (రూ.5.89 లక్షల కోట్లు) ఎగబాకింది మరి. దీంతో ఇప్పుడాయన సంపద బ్లూంబర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం తొలిసారి 347.8 బిలియన్ డాలర్ల (రూ.29.25 లక్షల కోట్లు)ను చేరింది. 2021 నవంబర్లో గరిష్ఠంగా 321.7 బిలియన్ డాలర్లుగా నమోదై రికార్డు సృష్టించగా, ఆ రికార్డు ఇప్పుడు చెరిగిపోయినైట్టెంది. ట్రంప్, మస్క్ మధ్యనున్న సంబంధాలు.. స్టాక్ మార్కెట్లలో టెస్లా షేర్ విలువను పరుగులు పెట్టిస్తున్నాయి.