హైదరాబాద్, జూన్ 19(నమస్తే తెలంగాణ బిజినెస్): ఆర్థిక ఇబ్బందులతో గతేడాది మార్చిలో మూతపడిన ప్రాంతీయ విమాన సేవల సంస్థ ట్రూజెట్ మళ్లీ టెకాఫ్ అవడానికి సిద్ధమవుతున్నది. అమెరికాకు చెందిన ఎన్ఎస్ ఏవియేషన్ తాజాగా భారత్లో విమాన సేవలు అందించేందుకుగాను ట్రూజెట్లో మెజార్టీ వాటాను కొనుగోలు చేసింది. రూ.450 కోట్ల విలువైన ట్రూజెట్లో 85 శాతం వాటాను హస్తగతం చేసుకున్నది. ఈ సందర్భంగా కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ ఉమేశ్ మాట్లాడుతూ..ట్రూజెట్లో ఎన్ఎస్ ఏవియేషన్ మెజార్టీ వాటాను కొనుగోలు చేసిందని, దీంతో త్వరలో విమాన సేవలు తిరిగి ప్రారంభించబోతున్నట్టు ప్రకటించారు.