న్యూఢిల్లీ, సెప్టెంబర్ 17: ప్రముఖ వాహన సంస్థ బజాజ్ ఆటో..ప్రీమియం మోటార్‌సైకిళ్ల బ్రాండ్ ట్రయంఫ్‌ను మరింత బలోపేతం చేయడానికి మరో రెండు మాడళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. 400 సీసీ సెగ్మెంట్లో విడుదల చేసిన స్పీడ్ టీ4 మాడల్ ధర రూ.2.17 లక్షలుగాను, మై25 స్పీడ్ 400 మాడల్ ధర రూ.2.40 లక్షలుగా నిర్ణయించింది.
ఈ ధరలు ఢిల్లీ షోరూంనకు సంబంధించినవి. ైస్టెలిష్, పనితీరు, టెక్నాలజీ పరంగా భారీ మార్పులు చేసిన సంస్థ..యువతను దృష్టిలో పెట్టుకొని ఈ బైకు వేగాన్ని మరింత పెంచినట్లు బజాజ్ ఆటో ప్రెసిడెంట్ ఉనిత్ సుమీత్ నారంగ్ తెలిపారు. ట్రయంఫ్ బ్రాండ్‌ను మరింత బలోపేతం చేయడానికి డీలర్ల సంఖ్యను ఈ ఏడాది చివరినాటికి 170కి, అలాగే వచ్చే ఏడాది 200కి పెంచుకోనున్నట్లు ఆయన ప్రకటించారు.
బ్రిటన్‌కు చెందిన మోటార్‌సైకిల్ బ్రాండ్ ట్రయంఫ్‌తో గతేడాది జతకట్టిన విషయం తెలిసిందే. చిన్న స్థాయి నగరాలు, పట్టణాల్లో కూడా డీలర్లను నెలకొల్పనున్నట్లు ఆయన ప్రకటించారు. ప్రస్తుతం 75 నగరాల్లో 120 డీలర్లు ఉన్నారు.