న్యూఢిల్లీ : ట్రయంఫ్ మోటార్‌సైకిల్స్ ఇండియా భారత్‌లో బానెవిల్లే గోల్డ్‌లైన్ ఎడిషన్స్తో పాటు న్యూ ట్రయంఫ్ రాకెట్ 3ఆర్ 221 స్పెషల్ ఎడిషన్, ట్రయంఫ్ రాకెట్ 3 జీటీ 221 స్పెషల్ ఎడిషన్‌ను లాంఛ్ చేసింది. వీటి ధరలు వరుసగా రూ 20.80 లక్షలు, రూ 21.40 లక్షలుగా కంపెనీ వెల్లడించింది. న్యూ 221 స్పెషల్ ఎడిషన్స్ న్యూ పెయింట్ స్కీమ్‌తో రాకెట్ మాస్క్యులర్ స్టైల్, హ్యాండ్లింగ్, టూరింగ్ సామర్ధ్యాలతో కస్టమర్ల ముందుకొచ్చింది.
ట్రయంఫ్ రాకెట్ 221 ఎడిషన్ ముందు భాగంలో ట్విన్ హెడ్‌లైట్స్, ట్రయంఫ్ సిగ్నేచర్ షేప్‌తో కూడిన ఎల్ఈడీ డేటైం రన్నింగ్ లైట్స్, రియర్ సైడ్ టెయిల్ లైట్స్, ఇండికేటర్స్, నెంబర్ ప్లేట్ లైట్స్‌ను అమర్చింది. ట్రయంఫ్ రాకెట్ 221 ఎడిషన్ 2458సీసీ ట్రిపుల్ ఇంజన్‌తో పాటు హై పెర్ఫామెన్స్ 6 స్పీడ్ హెలికల్-కట్ గేర్‌బాక్స్‌తో పాటు రాకెట్ స్టైల్‌తో కూడిన ఇంజన్ డిజైన్ ఆకట్టుకుంటుంది. ట్రయంఫ్ రాకెట్ 221 ఎడిషన్ రోడ్, రెయిన్, స్పోర్ట్, రైడర్ వంటి నాలుగు రైడింగ్ మోడ్స్ ఫీచర్లను కలిగిఉంది.