Triumph | ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ ట్రయంఫ్ (Triumph) తన న్యూ స్పెషల్ ఎడిషన్ ‘బొన్నీవిల్లే టీ120 (Bonneville T120)’ మోటారు సైకిల్ లోను ఆవిష్కరించింది. దీన్ని బొన్నివిల్లే టీ120 ఎల్విస్ ప్రెస్లీ (Bonneville T120 Elvis Presley) అని పిలుస్తున్నారు. అమెరికా నటుడు- గాయకుడు ఎల్విస్ ప్రెస్లీ సంస్మరణార్థం పరిమిత సంఖ్యలో మోటారు సైకిళ్లు తయారు చేస్తోంది ట్రయంఫ్. ప్రపంచవ్యాప్తంగా 925 యూనిట్లు మాత్రమే తయారు చేస్తోంది. స్టాండర్డ్ మోడల్ మోటారు సైకిల్‌తో పోలిస్తే పలు మార్పులూ చేర్పులు చేసింది. స్పెషల్ రెడ్ అండ్ సిల్వర్ కలర్ స్కీంలో వస్తోందీ ట్రయంఫ్ బొన్నివిల్లే టీ120 ఎల్విస్ ప్రెస్లీ మోటారు సైకిల్. జే డార్ కస్టమ్ బొన్నివిల్లే ఏర్పాటు చేసిన ఎల్విస్ ప్రెస్ లీ చారిటబుల్ ఫౌండేషన్ స్ఫూర్తితో కలర్ ఆప్షన్లు ఖరారయ్యాయి.
270-డిగ్రీల ఫైరింగ్ ఆర్డర్‌తో 1200సీసీ పార్లల్ ట్విన్ ఇంజిన్ కలిగి ఉంటుందీ ట్రయంఫ్ బొన్నివిల్లే టీ120 ఎల్విస్ ప్రెస్లీ బైక్. 6550 ఆర్పీఎం వద్ద గరిష్టంగా 78.9 బీహెచ్పీ విద్యుత్, 3500 ఆర్పీఎం వద్ద 105 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. 6-స్పీడ్ గేర్ బాక్స్ ఉంటుంది. ట్రయంఫ్ బొన్నివిల్లే టీ120 ఎల్విస్ ప్రెస్లీ బైక్‌లో ట్యూబులర్ స్టీల్‌తో ట్విన్ క్రెడిల్ ఫ్రేమ్ తయారు చేశారు. ప్రీ లోడ్‌కు అడ్జస్టబుల్గా ఫ్రంట్‌లో 41ఎంఎం సస్పెండెడ్ ఫోర్క్స్, రేర్ లో ట్విన్ షాక్ అబ్జార్బర్స్ జత చేశారు. ఫ్రంట్ లో 310 ఎంఎం డిస్క్ బ్రేక్స్, రేర్ లో 255 ఎంఎం డిస్క్ బ్రేక్ ఉంటాయి. డ్యుయల్ చానెల్ ఏబీఎస్ ఆఫర్ కూడా ఉంటుంది.