న్యూఢిల్లీ, ఏప్రిల్ 7 : భవిష్యత్తులో కేవలం కాల్, ఎస్ఎంఎస్ల కోసం ప్రత్యేక మొబైల్ ప్లాన్లు అందుబాటులోకి రాబోతున్నాయి. ఇందుకు సంబంధించి టెలికాం నియంత్రణ మండలి ట్రాయ్…ఇలాంటి ప్రత్యేక మొబైల్ ప్లాన్ను తప్పనిసరిగా విడుదల చేయాలని టెలికాం సంస్థలను ఆదేశించింది. ఈ కొత్త ప్లాన్లు అందుబాటులోకి వస్తే డాటా కోసం అదనంగా వెచ్చించాల్సిన పనిలేదు.
గతంలో టెలికాం సంస్థలు డాటాతోపాటు ప్రత్యేక ప్లాన్లను విడుదల చేసి ఈ ప్లాన్లలో డాటాను ఎత్తివేసినప్పటికీ చార్జీలో మాత్రం తగ్గించలేదని గుర్తించిన ట్రాయ్..ఈ కొత్త ప్లాన్ను ఆవిష్కరించాలని సూచించింది. దీంతో ఫీచర్ ఫోన్లను వాడుతున్న వారికి ఆర్థిక ప్రయోజనం కలుగనున్నదని పేర్కొంది.