న్యూఢిల్లీ, మే 9 : శాటిలైట్ కమ్యూనికేషన్ (శాట్కమ్) కంపెనీలకు టెలికం రెగ్యులేటర్ ట్రాయ్ షాకిచ్చింది. స్టార్‌లింక్ వంటి శాట్కమ్ సంస్థలు తమ మొత్తం ఆదాయం (అడ్జస్టెడ్ గ్రాస్ రెవిన్యూ లేదా ఏజీఆర్)లో 4 శాతాన్ని కేంద్ర ప్రభుత్వానికి స్పెక్ట్రమ్ చార్జీలుగా చెల్లించాల్సిందేనని శుక్రవారం సిఫార్సు చేసింది. అయితే తక్కువ చార్జీల కోసం ఆయా కంపెనీలు లాబీయింగ్ చేసినదానికంటే ఇది చాలా ఎక్కువ.
పైగా శాట్కమ్ సంస్థలకు 8 శాతం లైసెన్స్ ఫీ కూడా వర్తిస్తుందని చెప్పింది. కాగా, టెలికం శాఖకు ఇచ్చిన సిఫార్సుల్లో పట్టణ ప్రాంతాల్లో శాటిలైట్ ఆధారిత బ్రాడ్‌బాండ్ ఇంటర్నెట్ సేవలను అందించే ఆపరేటర్లు ఏటా ఒక్కో సబ్స్రైబర్ వద్ద అదనంగా రూ.500 వసూలు చేసుకోవచ్చని ట్రాయ్ చెప్పింది. అయితే గ్రామీణ ప్రాంతాల్లో వద్దన్నది.