Toyota Vellfire Luxury MPV | ప్రముఖ కార్ల తయారీ సంస్థ టయోటా కిర్లోస్కర్ మోటార్ ఇండియా.. దేశీయ మార్కెట్లోకి న్యూ జనరేషన్ మల్టీ పర్పస్ వెహికల్ (ఎంవీపీ) లగ్జరీ కారు వెల్ఫైర్ ఆవిష్కరించింది. అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ సేఫ్టీ ఫీచర్లతోపాటు 60కి పైగా కనెక్టింగ్ ఫీచర్లతో వచ్చింది కిర్లోస్కర్ వెల్ఫైర్. లీటర్ పెట్రోల్‌తో 19.28 కి.మీ. మైలేజీ వస్తుంది.
రెండు వేరియంట్లలో కిర్లోస్కర్ వెల్ఫైర్ ఎంవీపీ ఆవిష్కరించారు. హై గ్రేడ్ వేరియంట్ కారు రూ.1.19 కోట్లు (ఎక్స్ షోరూమ్) అని నిర్ణయించారు. టాప్ వేరియంట్ వీఐపీ గ్రాండ్ ఎగ్జిక్యూటివ్ లాంజ్ రూ.1.30 కోట్లు పలుకుతుంది. నవంబర్ నుంచి కార్ల డెలివరీ ప్రారంభిస్తారు. మెర్సిడెస్ – బెంజ్ వీ-క్లాస్ కారుతో వెల్ఫైర్ ఢీ కొంటుంది.
టీఎన్జీఏ-కే ప్లాట్‌ఫామ్ ఆధారంగా అప్డేటెడ్ వెల్ఫైర్ రూపుదిద్దుకున్నది. సౌకర్యవంతమైన ప్రయాణం కోసం అడ్వాన్స్డ్ సస్పెన్షన్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. ఫ్రంట్‌లో లార్జ్ 6-స్లాట్ క్రోమ్ ఫ్రంట్ గ్రిల్లె, త్రీ లెన్స్ స్ప్లిట్ హెడ్ ల్యాంప్స్, ఎల్ఈడీ డీఆర్ఎల్స్, వీ-షేప్డ్ క్రోమ్ స్ట్రిప్ కనెక్టింగ్ బాత్ హెడ్ ల్యాంప్స్, బ్లాక్ డ్ ఔట్ పిల్లర్స్ విత్ క్రోమ్ ఫినిష్, సింగిల్ యూనిట్ గ్లాస్ హౌస్ తదితర ఫీచర్లు ఉంటాయి.
ఇంకా వీ-షేప్డ్ టెయిల్ ల్యాంప్స్, మధ్యలో టయోటా లోగో, వెల్ఫైర్ బ్యాడ్జింగ్, డ్యుయల్ టోన్ అల్లాయ్ వీల్స్, ఇంటిగ్రేటెడ్ టర్న్ లైట్ ఓఆర్వీఎం, క్రోమ్ బ్యాక్ డోర్ గార్నిష్, క్రోమ్ డోర్ హ్యాండిల్స్ తదితర ఫీచర్లు కూడా జత చేశారు. మూడు రంగుల్లో (ప్లాటినం పెరల్ వైట్, జెట్ బ్లాక్, ప్రిసియస్ మెటల్) వస్తున్న ఈ కారు ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 60 లీటర్లు.
అప్ డేటెడ్ టయోటా వెల్ఫైర్ 2.5 లీటర్ల 4 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ తో వస్తున్నది. ఈ ఇంజిన్ గరిష్టంగా 193 హెచ్‌పీ, 240 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది. ఈ-సీవీటీ గేర్ బాక్స్ తో కూడా నడుస్తుంది. ఈ కారు ఇంజిన్ ఎలక్ట్రిక్ మోటార్, హైబ్రీడ్ బ్యాటరీతో వస్తుంది. తద్వారా కర్బన ఉద్గారాలను తగ్గిస్తుంది. రెండో దశ బీఎస్-6 ప్రమాణాలకు అనుగుణంగా డిజైన్ చేసిన అప్ డేటెడ్ టయోటా కిర్లోస్కర్ వెల్ఫైర్ ఈ-20 పెట్రోల్‌తోనూ నడుస్తుంది.