Toyota | బెంగళూరు, అక్టోబర్ 22: ప్రస్తుత పండుగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకొని టయోటా కిర్లోస్కర్.. దేశీయ మార్కెట్లోకి ‘రుమియన్’ నయా మాడల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. లిమిటెడ్ ఎడిషన్‌గా విడుదల చేసిన ఈ మాడల్‌ను ప్రీమియం టీజీఏ ప్యాకేజ్ కింద రూ.20,608 విలువైన ప్రయోజనాలు కల్పిస్తున్నది. ఈ నెల 31 వరకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని పేర్కొంది. ఈ కారు రూ.10.44-13.73 లక్షల ధరల శ్రేణిలో లభించనున్నది.