న్యూఢిల్లీ : భారత్‌లో న్యూ టయోటా ఫార్చూనర్ లెజెండర్ 4×4ను టయోటా కిర్లోస్కర్ మోటార్ లాంఛ్ చేసింది. ఈ ఎస్యూవీ ధర రూ 42.33 లక్షలుగా నిర్ణయించింది. న్యూ వేరియంట్‌తో 2021 టయోటా ఫార్చూనర్ లెజండర్ 4×2 , 4×4 డ్రైవ్ సిస్టమ్స్‌లో అందుబాటులో ఉంది. 2021 ఫార్చూనర్ లెజెండర్ న్యూ ఫ్రంట్ గ్రిల్, స్కప్టెడ్ బంపర్, న్యూ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్ యూనిట్, ఎల్ఈడీ డీఆర్ఎల్ వంటి న్యూ ఎక్ట్సీరియర్ ఎలిమెంట్స్‌తో ఆకట్టుకోనుంది.
2021 టయోటా ఫార్చూనర్ లెజండర్ 4×4 డ్యూయల్ టోన్ పెర్ల్ వైట్, బ్లాక్ రూఫ్ కలర్ ఆప్షన్లో అందుబాటులో ఉంది. ఇక ఇంటీరియర్ ఫీచర్ల విషయానికి వస్తే న్యూ లెజెండర్ సీట్ వెంటిలేషన్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే కంపాటిబిలిటీతో కూడిన భారీ టచ్‌స్క్రీన్ సిస్టమ్‌తో ముందుకొచ్చింది. ఎకో, నార్మల్, స్పోర్ట్, ఫ్రంట్ క్లియరెన్స్ సొనర్ డ్రైవ్ మోడ్స్‌తో కూడిన పవర్ స్టీరింగ్ వంటి ఫీచర్లు ఆకట్టుకుంటాయి.