న్యూఢిల్లీ, ఏప్రిల్ 6 : టయోటా సంస్థ వాహన కొనుగోలుదారులకు షాకిచ్చింది. అన్ని రకాల మాడళ్ల ధరలను రూ.2.16 లక్షల వరకు పెంచుతున్నట్టు ప్రకటించింది. దీంతో ఫార్చ్యూనర్, ఇన్నోవా, హైరైడర్, గ్లాంజా, టైసర్, హిలక్స్, ఎల్సీ 300 మాడళ్లు రెండు శాతం వరకు పెంచింది.
పెరిగిన ధరలు అమల్లోకి వచ్చాయని పేర్కొంది. సంస్థ తీసుకున్న తాజా నిర్ణయంతో ఇన్నోవా క్రైస్టా రూ.39 వేల వరకు అధికం కానుండగా, ఫార్చ్యూనర్ రూ.69 వేలు, ఇన్నోవా హైక్రాస్ రూ.54 వేల వరకు, అర్బన్ క్రూజర్ హైరైడర్ రూ.5 వేల వరకు, గ్లాంజా రూ.20 వేలు, టైసర్ రూ.22 వేలు, హిలక్స్ రూ.56 వేలు, ల్యాండ్ క్రూజర్ 300 రూ.2.16 లక్షల వరకు ప్రియంకానున్నాయి.