శుక్రవారం 23 అక్టోబర్ 2020
Business - Sep 19, 2020 , 01:04:13

101.3 లక్షల కోట్లకు కేంద్రం అప్పులు

101.3 లక్షల కోట్లకు కేంద్రం అప్పులు

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ అప్పులు ఈ ఏడాది జూన్‌ ఆఖరు నాటికి రూ.101.3 లక్షల కోట్లకు పెరిగాయి. ఈ మేరకు శుక్రవారం ఆర్థిక మంత్రిత్వ శాఖ నివేదిక తెలియజేసింది. మార్చి 31 నాటికి రూ.94.6 లక్షల కోట్లుగానే ఉండగా, ఈ మూడు నెలల్లో రూ.6.7 లక్షల కోట్లు ఎగబాకాయి. గతేడాది జూన్‌ చివరి నాటికి సర్కారీ అప్పుల భారం రూ.88.18 లక్షల కోట్లుగా ఉన్నది. కాగా, ఈ జూన్‌ 30 నాటికి మొత్తం బకాయిల్లో (బాండ్లు, ఇతర సెక్యూరిటీలుసహా) ఈ రూ.101.3 లక్షల కోట్లు 91.1 శాతంగా ఉన్నట్లు ప్రజా పద్దు నిర్వహణపై విడుదల చేసిన తాజా త్రైమాసిక నివేదికలో ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ ఏప్రిల్‌-జూన్‌లో రూ.3,46,000 కోట్ల విలువైన సెక్యూరిటీలను కేంద్ర ప్రభుత్వం జారీ చేసింది. గతేడాదితో పోల్చితే ఇది 1.25 లక్షల కోట్లు అధికం కావడం గమనార్హం. అలాగే మరో రూ.80 వేల కోట్లను క్యాష్‌ మేనేజ్‌మెంట్‌ బిల్లుల జారీ ద్వారా మోదీ సర్కారు పొందింది.


logo