న్యూఢిల్లీ, జూలై 18: జపాన్‌కు చెందిన ఎలక్ట్రిక్ పరికరాల తయారీ సంస్థ తోషిబా గ్రూపు..భారత్లోవున్న ప్లాంట్ సామర్థ్యాన్ని పెంచుకోనున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం 10 బిలియన్ జపాన్ యెన్(రూ.500 కోట్లకు పైమాటే)తో తెలంగాణలోని హైదరాబాద్‌కు సమీపంలో ఉన్న ప్లాంట్ సామర్థ్యాన్ని రెండింతలు పెంచుకోనున్నట్లు కంపెనీ చైర్పర్సన్, ఎండీ హిరోషి ఫురుటా ఈ సందర్భంగా తెలిపారు.
2023-24 నుంచి 2025-26 మధ్యకాలంలో ట్రాన్స్ఫార్మర్లు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ల ఉత్ప త్తి సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ఈ నిధులను ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. మేక్ ఇన్ ఇండియాతోపాటు ఎక్స్పోర్ట్ ఇండియాగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ పెట్టుబడులు చేయనున్నట్లు చెప్పారు. ఇందుకోసం అసెంబ్లింగ్ యూ నిట్‌లో లైన్ కెపాసిటీని పెంచుతున్నది. ప్రస్తుతం భారత్‌లో అత్యధిక డిమాండ్ ఉన్న 400కేవీ/765కేవీ ట్రాన్స్ఫార్మర్లను సంస్థ ఉత్పత్తి చేస్తున్నది.