Credit Cards | గతంతో పోలిస్తే ప్రస్తుతం క్రెడిట్ కార్డుల వాడకం బాగా పెరిగింది. వీసా, మాస్టర్ కార్డ్ వంటి అంతర్జాతీయ సంస్థలకు పోటీగా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) రూపొందించిన రూపే క్రెడిట్ కార్డు (Rupay Credit Card)లకు డిమాండ్ పెరిగింది. 2022 జూన్ నుంచి యూపీఐ ప్లాట్‌ఫామ్‌లపై స్మార్ట్ ఫోన్ యూజర్లు స్మూత్‌గా లావాదేవీలు నిర్వహించేందుకు రూపే క్రెడిట్ కార్డు చెల్లింపులను అనుమతించింది. వీసా, మాస్టర్ కార్డులకు బదులు ప్రారంభ దశలో రూపే క్రెడిట్ కార్డులతో యూపీఐ చెల్లింపులకు ఆర్బీఐ పర్మిషన్ ఇచ్చింది. ఇతర ప్రధాన క్రెడిట్ కార్డులతో పోలిస్తే రూపే క్రెడిట్ కార్డులకు ఆదరణ పెరిగింది. క్యాష్ లెస్ ఎకానమీ దిశగా అడుగులేస్తున్న నేపథ్యంలో లభ్యత, చౌక ఫీజులతో అందుబాటులో ఉన్నాయి రూపే క్రెడిట్ కార్డులు. ప్రతి ఒక్కరూ తమ లైఫ్ స్టయిల్, ఆదాయానికి అనుగుణంగా అవసరమైన క్రెడిట్ కార్డును ఎంచుకోవచ్చు.
ఇండస్ఇండ్ బ్యాంక్ ప్లాటినం రూపే క్రెడిట్ కార్డు – ఫీజు అక్కర్లేదు
యెస్ బ్యాంక్ పైసా బజార్ పైసా సేవ్ క్రెడిట్ కార్డు – రూ.499
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ యూపీఐ రూపే క్రెడిట్ కార్డు – రూ.500
మైంత్రా కోటక్ క్రెడిట్ కార్డు – రూ.500
హెచ్డీఎఫ్సీ మనీ బ్యాక్+ క్రెడిట్ కార్డు – రూ.500
ఐసీఐసీఐ హెచ్‌పీసీఎల్ సూపర్ సేవ్ క్రెడిట్ కార్డు – రూ.500
ఐఆర్సీటీసీ ఎస్బీఐ ప్లాటినం క్రెడిట్ కార్డు – రూ.300
ప్రతి రూ.100 యూపీఐ లావాదేవీలపై రెండు రివార్డు పాయింట్లు. నాన్ యూపీఐ లావాదేవీలైతే ఒక రివార్డు
బీమా, ప్రభుత్వ లేదా విద్యా రంగ బిల్లుల వంటి యుటిలిటీ బిల్లులు రూ.100 చెల్లిస్తే ఏడు పాయింట్లు
ఫ్యుయల్ వినియగంపై ఒకశాతం ఫ్యుయల్ సర్ చార్జీ మాఫీ (నెలకు గరిష్టంగా రూ.400 ఆదా చేయొచ్చు)
యూపీఐ పేమెంట్స్ మీద రెండు శాతం రివార్డు పాయింట్లు.
ఏటా దేశీయ విమానాశ్రయ లాంజ్ల్లో 12 కాంప్లిమెంటరీ పాస్‌లు.
నెలకు రూ.5000 విలువైన షాపింగ్‌పై ఆన్లైన్ చెల్లింపులకు మూడు శాతం క్యాష్ బ్యాక్ పాయింట్లు.
యూపీఐ పేమెంట్స్‌తోపాటు అన్ని రకాల ఇతర చెల్లింపులపై 1.5శాతం క్యాష్ బ్యాక్ పాయింట్లు.
ఆన్ లైన్ లావాదేవీల్లో మంత్లీ స్పెండింట్ లిమిట్ దాటితే 1.5శాతం క్యాష్ బ్యాక్.
ఏడాదిలో రూ.1.2 లక్షలు ఖర్చు చేస్తే వార్షిక రెన్యూవల్ ఫీజు మాఫీ.
ఫ్యుయల్ వినియోగంపై ఒకశాతం సర్‌చార్జి మాఫీ. (నెలకు రూ.250 వరకూ ఆదా)
పేజ్యాప్, గ్రాసరీస్, సూపర్ మార్కెట్, డైనింగ్, యుపీఐ లావాదేవీలపై మూడు శాతం క్యాష్ పాయింట్లు (నెలకు 500 పాయింట్లు)
యుటిలిటీ చెల్లింపులపై రెండు శాతం క్యాష్ పాయింట్లు ((నెలకు 500 పాయింట్లు)
ఇతర చెల్లింపులపై ఒకశాతం క్యాష్ పాయింట్లు ((నెలకు 500 పాయింట్లు)
ఏడాదిలో రూ.25 వేలు ఖర్చు చేస్తే వార్షిక రెన్యూవల్ ఫీజ్ మాఫీ.
వెల్కం బోనస్ కింద రూ.250 గిఫ్ట్ ఓచర్.
మైంత్రాలో రూ.750 వరకూ లావాదేవీలపై 7.5 శాతం మాఫీ.
ఒక నెలలో స్విగ్గీ, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, పీవీఆర్, క్లియర్ ట్రిప్, అర్బన్ కంపెనీల్లో రూ.1000 లావాదేవీ జరిపితే ఐదు శాతం క్యాష్ బ్యాక్.
ఇతర లావాదేవీలపై 1.25శాతం అపరిమిత క్యాష్ బ్యాక్.
మూడు నెలల్లో రూ.50 వేలు ఖర్చు చేస్తే రెండు పీవీఆర్ టికెట్లు కాంప్లిమెంటరీ
ఫ్యుయల్ వినియోగంపై ఒకశాతం ఫ్యుయల్ సర్‌చార్జీ మాఫీ (ఏడాదిలో రూ. 3500 ఆదా) – రూ.500- రూ.3000 మధ్య లావాదేవీలు జరపాలి.
ఇతర క్యాటగిరీల్లో ప్రతి రూ.150 చెల్లింపులపై రెండు క్యాస్ బ్యాక్ పాయింట్లు
జాయినింగ్ ఫీజు చెల్లించి వెల్కం బెనిఫిట్ పొందితే 500 క్యాష్ పాయింట్లు
లావాదేవీల్లో వార్షిక మైలురాళ్లు దాటితే రూ.2000 వరకూ గిఫ్ట్ ఓచర్లు
ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, స్విగ్గీ, రిలయన్స్ స్మార్ట్ సూపర్ స్టోర్, బిగ్ బాస్కెట్ చెల్లింపులపై 10 రెట్లు క్యాష్ పాయింట్లు.
సెలెక్టెడ్ మర్చంట్ల వద్ద ఈఎంఐ లావాదేవీలపై ఐదు రెట్ల క్యాష్ పాయింట్లు.
హెచ్‌పీసీఎల్ పెట్రోల్ బంకుల వద్ద చెల్లింపులపై నాలుగు శాతం క్యాష్ బ్యాక్ (నెలకు రూ.200) + ఒకశాతం సర్‌చార్జి మాఫీ.
హెచ్‌పీ పే యాప్ ద్వారా రూ.100 చెల్లింపుపై ఆరు రివార్డు పాయింట్లతోపాటు అదనంగా 1.5 శాతం ఆదాం
రిటైల్ కొనుగోళ్లపై రూ.100 చెల్లిస్తే రెండు రివార్డ్ పాయింట్లు.
హెచ్‌పీ పే యాప్ ద్వారా రీచార్జీ చేసుకుంటే రూ.100 క్యాష్ బ్యాక్ ప్లస్ జాయినింగ్ బోనస్ కింద 2000 రివార్డు పాయింట్లు
అంతకు ముందు త్రైమాసికంలో రూ.35వేలు ఖర్చు చేస్తే ఒక దేశీయ విమానాశ్రయ లాంజ్ యాక్సెస్ లభ్యం
హెచ్‌పీసీఎల్ పెట్రోల్ బంకుల్లో ఖర్చుపై 6.5 శాతం వరకూ ఆదా.
గ్రాసరీస్, యుటిలిటీ బిల్లుల చెల్లింపుపై ఐదు శాతం క్యాష్ బ్యాక్.
తొలి 45 రోజుల్లో రూ.500 ఖర్చు చేస్తే రూ.350 విలువ గల 350 రివార్డు పాయింట్లు
ఐఆర్సీటీసీ వెబ్సైట్ ద్వారా ఏసీ1, ఏసీ2, ఏసీ3, ఏసీ చైర్ కార్ టికెట్లు బుక్ చేసుకుంటే పది శాతం వాల్యూ బాక్.
ఐఆర్సీటీసీ ద్వారా టికెట్ కొనుగోలుతోపాటు ఫ్యుయలేతర లావాదేవీల కోసం ప్రతి రూ.125 ఖర్చుపై ఒక రివార్డు పాయింట్
ఏటా నాలుగు రైల్వే లాంజ్ కాంప్లిమెంటరీ యాక్సెస్‌లు.
రైల్వే టికెట్ల బుకింగ్స్ మీద ఒకశాతం ట్రాన్సాక్షన్ ఫీజు మాఫీ.
అన్ని రైట్వే టికెట్ల బుకింగ్ మీద పది శాతం వాల్యూ బ్యాక్ బెనిఫిట్.