Wilful Defaulters | కావాలనే బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టిన వాళ్లలో టాప్ 10 వీళ్లే!
Wilful Defaulters | దేశంలోని బ్యాంక్‌ల రుణాల్ని ఉద్దేశ్యపూర్వకంగా అత్యధిక మొత్తం లో ఎగవేసిన టాప్-50 జాబితాను కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది.
Wilful Defaulters | న్యూఢిల్లీ, ఆగస్టు 1: దేశంలోని బ్యాంక్‌ల రుణాల్ని ఉద్దేశ్యపూర్వకంగా అత్యధిక మొత్తం లో ఎగవేసిన టాప్-50 జాబితాను కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. గీతాంజలి జెమ్స్, ఎరా ఇన్ఫ్రా ఇంజనీరింగ్, ఆర్ఈఐ ఆగ్రో, ఏబీజీ షిప్‌యార్డ్‌లతో సహా 50 సంస్థలు.. బ్యాంకు లు, ఆర్థిక సంస్థలకు రూ. 87,295 కోట్లు ఉద్దేశ్యపూర్వకంగా ఎగవేసినట్టు రాజ్యసభకు ఒక లిఖితపూర్వక సమాధానంలో ఆర్థిక శాఖ సహాయమంత్రి భగవత్ కారద్ తెలిపారు. ఇందులో టాప్-10 ఎగవేతదారులు రూ.40,825 కోట్లు బ్యాంక్‌లకు బకాయి ఉన్నారని పేర్కొన్నారు. దేశం నుంచి పరారైన వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సికి చెందిన గీతాంజలి జెమ్స్ అత్యధికంగా రూ.8,738 కోట్లు ఎగవేసింది.
ఐదేండ్లలో 10 లక్షల కోట్ల రైటాఫ్
షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంక్‌లు గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో రూ.10,57,326 కోట్లు (2022-23 ఆర్థిక సంవత్సరపు ఆర్బీఐ గణాంకాల ప్రకారం) రైటాఫ్ చేసినట్టు మంత్రి రాజ్యసభకు వెల్లడించారు.
టాప్-10 ఎగవేతదార్లు ఎగవేత మొత్తం (రూ.కోట్లలో)
- గీతాంజలి జెమ్స్ ; 8,738
- ఎరా ఇన్ఫ్రా ఇంజనీరింగ్ ; 5,750
- ఆర్ఈఐ ఆగ్రో ; 5,148
- ఏబీజీ షిప్‌యార్డ్ ; 4,774
- కాన్‌కాస్ట్ స్టీల్ అండ్ పవర్ ; 3,911
- రోటామాక్ గ్లోబల్ ; 2,894
- విన్సమ్ డైమండ్స్ ; 2,846
- ఫ్రాస్ట్ ఇంటర్నేషనల్ ; 2,518
- శ్రీ లక్ష్మి కాట్సిన్ ; 2,180
- జూమ్ డెవలపర్స్ ; 2,066
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

