CNG SUV Cars | ఎస్యూవీ మోడల్స్.. ఎలక్ట్రిక్ కార్లు.. సీఎన్జీ కార్లు.. ఇప్పుడు భారతీయ కస్టమర్లను ఆకర్షించేందుకు కార్ల కంపెనీలు తయారు చేస్తున్న వివిధ మోడల్ కార్లు. వీటిల్లో సీఎన్జీ వేరియంట్ కార్లు చౌక ధరకే అందుబాటులోకి వస్తున్నాయి. పెట్రోల్ లేదా డీజిల్ వినియోగ కార్ల కంటే సీఎన్జీ వేరియంట్ కార్ల నుంచి తక్కువ కాలుష్యం వెలువడుతుంది. దీనికితోడు ఇంధన ధరలు రోజురోజుకు పెరిగిపోతుండటంతో సీఎన్జీ వేరియంట్ కార్లపైనే ఇండియన్స్ మోజు పెంచుకుంటున్నారు. తదనుగుణంగా కార్ల తయారీ సంస్థలు కూడా సీఎన్జీ వేరియంట్ కార్ల తయారీపైనే ఎక్కువ ఫోకస్ చేస్తున్నాయి. ఈ క్రమంలో దేశంలోనే టాప్-5 సీఎన్జీ కార్ల గురించి తెలుసుకుందామా.. !
టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ ఈ ఎస్యూవీ కారు ఇప్పటికే భారత్ మార్కెట్లోకి వచ్చేసింది. త్వరలో సీఎన్జీ వేరియంట్ కూడా ఇండియన్స్‌కు చేరువ కానున్నది. ఇప్పటికే సీఎన్జీ వేరియంట్ కార్ల కోసం ఆసక్తికల వారి నుంచి బుకింగ్స్ మొదలయ్యాయి. అర్బన్ క్రూయిజర్ హై రైడర్ ఈ సీఎన్జీ.. ఎస్, జీ వేరియంట్లలో లభ్యం అవుతుంది. సీఎన్జీ అర్బన్ క్రూయిజర్ హై రైడర్ ఈ వేరియంట్ కారు 4-సిలిండర్ల 1.5 లీటర్ సామర్థ్యంతో కూడిన ఇంజిన్.. కిలో సీఎన్జీకి 26.10 కిలో మీటర్ల మైలేజీ ఇస్తుంది.
మారుతి సుజుకి గ్రాండ్ విటారా.. టయోటా అర్బన్ క్రూయిజర్ హై రైడర్.. ఐడెంటికల్ వెహికల్స్. ఇప్పటికే టయోటా క్రూయిజర్ హై రైడర్ బుకింగ్స్ మొదలయ్యాయి. మారుతి కూడా త్వరలో గ్రాండ్ విటారా ఎస్యూవీ సీఎన్జీ వేరియంట్‌ను మార్కెట్లోకి తేనున్నది. గ్రాండ్ విటారా సీఎన్జీ కంపాటిబుల్ పవర్ ట్రైన్ 87 బీహెచ్పీ పవర్, 121.5 ఎన్ఎం టార్చి వెలువరిస్తుందని భావిస్తున్నారు. క్రూయిజర్ హై రైడర్ మాదిరిగానే కిలో సీఎన్జీపై 26.10 కి.మీ. మైలేజీ వస్తుంది. అర్బన్ క్రూయిజర్ తరహాలోనే మారుతి గ్రాండ్ విటారా సైతం 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఆప్షన్ కలిగి ఉంటుందని తెలుస్తోంది.
ఇతర కంపెనీల కంటే మారుతి సుజుకి ఒకింత దూకుడు మీద ఉంది. బ్రెజ్జా ఎస్యూవీ సీఎన్జీ వర్షన్ కారును తీసుకొస్తున్నది. భవిష్యత్‌లో ఎస్యూవీ కేటగిరీలో తన వాటా పెంచుకునేందుకు మారుతి సుజుకి ప్రస్తుతం ఆటోమేటిక్ సీఎన్జీ బ్రెజా కారును తెచ్చే పనిలో బిజీబిజీగా ఉన్నట్లు సమాచారం. బ్రెజా సీఎన్జీ కారు ఇంజిన్‌కు 1.5 లీటర్ల కే 15సీ సామర్థ్యం ఉంది. సీఎన్జీ వర్షన్ కారు ఇంజిన్ గరిష్టంగా 87 బీహచ్పీ, 121.5 ఎన్ఎం టార్చి వెలువరిస్తుందని భావిస్తున్నారు.
ఎస్యూవీ క్యాటగిరీ కార్లలో దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న వాటిల్లో టాటా పంచ్ది రెండో స్థానం. కంపాక్ట్ ఫుట్ ప్రింట్ ఉన్నా టాటా పంచ్‌కు 5-స్టార్ సేఫ్టీ రేటింగ్, గ్లోబల్ ఎన్సీఏపీ అడల్ట్ ప్రొటక్షన్ గుర్తింపు లభించింది. 1.2 లీటర్ల రెవొట్రోన్ పెట్రోల్ ఇంజిన్ టాటా పంచ్ ఎస్యూవీ కారును అప్డేట్ చేశారు. అప్డేటెడ్ ఇంజిన్ 84.48 బీహెచ్పీ పవర్, 113 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్, 5-స్పీడ్ ఏఎంటీ గేర్ బాక్స్ చాయిస్‌ల్లో ఏదో ఒకటి ఎంచుకోవచ్చు.
టాటా పంచ్ సీఎన్జీ వర్షన్ కారులోనూ సేమ్ పవర్ ట్రైన్ ఉంటాయి. సీఎన్జీ వేరియంట్ కారు ఇంజిన్ 73 బీహెచ్పీ విద్యుత్, 95 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది. తాజా టాటా పంచ్ ఎస్యూవీ సీఎన్జీ వేరియంట్ కారు 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తోపాటు సోల్ గేర్ బాక్స్ ఆప్షన్‌తో వస్తుంది.
దక్షిణ కొరియా ఆటో మేజర్ కియా మోటార్స్ మల్టీ పర్పస్ వెహికల్.. కరెన్స్.. దేశంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న కారు. మెరుగైన ఫీచర్లతో కస్టమర్ల మనస్సు దోచుకుంటున్న కరెన్స్‌ను కియా సీఎన్జీ వర్షన్లోనూ తీసుకొస్తున్నది. 7-స్పీడ్ డీసీటీ గేర్ బాక్స్ లేదా 6-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్‌తో కూడిన టర్బో చార్జ్డ్ సీఎన్జీ ఇంజిన్‌తో కియా కరెన్స్ వస్తున్నది.