Tomato turns costly | అకాల వర్షాలతో దెబ్బతిన్న టొమాటో.. కోల్‌కతాలో కిలో ఎంతంటే?!
Tomato turns costly | అకాల వర్షాలతో పంటలు దెబ్బతిన్నాయి మెట్రో సిటీల్లో కిలో టోమాటో రూ.72 వరకూ పలుకుతోంది.

మధ్యప్రదేశ్, మహారాష్ట్రల్లో అకాల వర్షాల వల్ల దేశంలోని వివిధ మెట్రో నగరాల్లో కిలో టొమాటో ధర రూ.72 పలుకుతోంది. అకాల వర్షాలతో గిరాకీకి అనుగుణంగా సరఫరా లేక టొమాటో ధర పెరిగినట్లు కనిపిస్తోంది.
నెల రోజుల క్రితం కిలో రూ.38 ఉన్న టోమాటో ధర మంగళవారం కోల్‌కతాలో రూ.72కు చేరుకున్నది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో రూ.57, చెన్నైలో రూ.30కి పెరిగింది. ముంబైలో కిలో టొమాటో ధర రూ.15 నుంచి రూ.53లకు దూసుకెళ్లింది. టొమాటో నాణ్యత, లోకాలిటీని బట్టి ధరలు ఆధారపడి ఉన్నాయి.
ఆ రాష్ట్రాల్లో దెబ్బతిన్న పంట
మధ్యప్రదేశ్, మహారాష్ట్రల్లో కురిసిన అకాల వర్షాలతో టొమాటో తోటలు దెబ్బతిన్నాయి. ఫలితంగా ఢిల్లీలోని కూరగాయల మార్కెట్లకు సరఫరా తగ్గిపోయిందని అజాద్‌పూర్ టొమాటో అసోసియేసన్ ప్రెసిడెంట్ అశోక్ కౌశిక్ బుధవారం పీటీఐకి చెప్పారు. ఢిల్లీలోని ఆజాద్‌పూర్ మండీ.. ఆసియాలోనే అతిపెద్ద కూరగాయల, పండ్ల మార్కెట్.
సిమ్లా వంటి పర్వత ప్రాంతాల్లోనూ ఇదే సీన్
సిమ్లా వంటి పర్వత ప్రాంతాల్లోనూ టొమాటో పంట దెబ్బ తిన్నది. అకాల వర్షాలతో సుమారు 60 శాతం పంట దెబ్బ తిన్నదని సమాచారం. ఫలితంగా ఢిల్లీలోని ఆజాద్‌పూర్ కూరగాయల మార్కెట్‌కు రోజు 250-300 టన్నుల టొమాటోలు వస్తాయి. కానీ అకాల వర్షాలతో అందులో సగం మాత్రమే వస్తున్నాయి. దీంతో కిలో టొమాటో ధర రెట్టింపై రూ.40-60 మధ్య పలుకుతున్నది.
ఏటా 19.75 మిలియన్ టన్నుల దిగుబడి
ప్రస్తుతం మధ్యప్రదేశ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో టొమాటో తోటలు ఇప్పుడిప్పుడే పెరుగుతున్నాయి. పంట చేతికి రావడానికి మరో రెండు, మూడు నెలలు పడుతుందని అంచనా. చైనా తర్వాత ప్రపంచంలోనే అత్యధిక టొమాటో దిగుబడి దారు భారత్‌లో 7.89 హెక్టార్ల పరిధిలో సుమారు 19.75 మిలియన్ టన్నుల టొమాటోలు పండుతున్నాయి. సగటున హెక్టార్‌కు 25.05 టన్నుల టొమాటోలు పండుతున్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి:
ఐఫోన్13కు చిప్‌ల కొరత.. యాపిల్ షేర్లు పతనం
Power Crisis | ప్రపంచానికి కరెంటు కష్టాలు.. ఇక పాలు కూడా పితకలేరేమో..
అదానీ నిమిషానికి ఎంత సంపాదిస్తాడో తెలుసా? సగటు వ్యక్తి జీవితకాలం కష్టపడినా అంత రాదు!!
రూ 15 లక్షల లోపు రానున్న టాప్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే..!
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- tomoto
- unseasonal rains
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

