Tomato | ప్రస్తుతం ప్రతి ఇంటిలో ఏ కూర వండుకోవాలన్నా టమాటాలు తప్పనిసరి. అంత నిత్యవసర వస్తువుగా మారిన టమాటాలతోపాటు ఇతర కూరగాయల ధరలు ఆకాశాన్నంటే రీతిలో దూసుకెళ్తున్నాయి. దేశవ్యాప్తంగా జోరుగా వర్షాలు కురుస్తుండటంతోపాటు ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో టమాటాల సరఫరాపై ప్రభావం పడుతోంది. ఫలితంగా దేశ రాజధాని ఢిల్లీలో రిటైల్ మార్కెట్లలో కిలో టమాటా ధర రూ.100 పలుకుతున్నది. మదర్ డైరీ, సఫాల్ రిటైల్ దుకాణాల్లో కిలో టమాటా రూ.100లకు విక్రయిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ వినియోగ వ్యవహారాల మంత్రిత్వశాఖ గణాంకాల ప్రకారం ఢిల్లీలో శనివారం కిలో టమాటా రూ.93 పలుకుతోంది. దేశవ్యాప్తంగా సగటున రూ.73.76లకు కిలో టమాటా లభిస్తుందని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.
హీట్ వేవ్ తదనుగుణంగా అధిక వర్షపాతం వల్ల టమాటాల సరఫరాలో అంతరాయం కలుగుతుండటంతోనే వాటి ధరలు పెరిగాయని కేంద్ర ప్రభుత్వ అధికారులు చెప్పారు. ఢిల్లీలో టమాటాలతోపాటు ఆలుగడ్డ, ఉల్లిగడ్డల ధరలు పెరిగిపోయాయని తెలిపారు. వెస్ట్ ఢిల్లీలోని మదర్ డైరీ స్టోర్ లో శనివారం కిలో ఉల్లిగడ్డ రూ.46.90, కిలో ఆలుగడ్డ రూ.41.90 పలికింది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఢిల్లీలో కిలో ఉల్లిగడ్డ రూ.50, కిలో ఆలుగడ్డ రూ.40 పలుకుతోంది. దేశవ్యాప్తంగా సగటున కిలో ఉల్లిగడ్డ ధర రూ.46.16, కిలో ఆలుగడ్డ రూ.37.22లకు లభిస్తుంది.
టమాటాలు, ఆలుగడ్డలు, ఉల్లిగడ్డలు మాత్రమే కాదు ఢిల్లీలో ఇతర కూరగాయల ధరలు మండిపోతున్నాయి. కిలో పొట్లకాయ రూ.59, కిలో కాకరకాయ రూ.49, ఫ్రెంచ్ బీన్స్ రూ.89, బెండకాయలు రూ.49, గ్రీన్ క్యాప్సికం రూ.119, పెద్ద వంకాయ రూ.59, చిన్న వంకాయ రూ.49 పలుకుతున్నాయి. ఇక అన్ సీజన్డ్ కాలిఫ్లవర్ కిలో రూ.139 లకు లభిస్తోంది.
Amazon Prime Day 2024 Sale-iPhone 13 | రూ.50 వేలలోపు ధరకే ఐఫోన్ 13.. ఇవీ డిటెయిల్స్..’
Hyundai Venue | వెన్యూ.. ఎక్స్టర్లపై హ్యుండాయ్ డిస్కౌంట్లు.. గరిష్టంగా రూ.55 వేలు..!
Suzuki Motor Cycles | ఫెస్టివ్ కలర్స్ తో సుజుకి యాక్సెస్.. బర్గ్మన్ స్ట్రీట్ స్కూటర్లు.. ధరలిలా..!