ముంబై : ప్రపంచ దేశాల్లో ఒమిక్రాన్ లాక్డౌన్ భయాందోళనల మధ్య నిన్న భారీ నష్టాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్లు ఈరోజు కాస్త ఊపందుకున్నాయి. కీలక రంగాల్లో వెల్లువెత్తుతున్న కొనుగోళ్ల మద్దతుతో ఇవాళ దేశీయ మార్కెట్లు లాభాల బాట పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లు కూడా సానుకూలంగా ఉండటంతో సూచీల సెంటిమెంట్‌ను మరింత బలపర్చింది.
దీంతో మంగళవారం సెన్సెక్స్ 403 పాయింట్లు వద్ద ఎగబాకి 56,226 వద్ద, నిఫ్టీ 118 పాయింట్ల లాభంతో 16,732 వద్ద కొనసాగుతున్నాయి. సిప్లా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, శ్రీ సిమెంట్, ఐషర్ మోటార్స్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతుండగా, హిందాల్కో ఇండస్ట్రీస్, బజాజ్, విప్రో, బజాజ్ ఫైనాన్స్, టాటా స్టీల్, ఫైనాన్స్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.