ముంబై: రూ.2000 నోట్ల(Rs 2000 Notes)ను ఆర్బీఐ ఉపసంహరిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటి వరకు 87 శాతం రూ.2000 నోట్లు తమ వద్దకు వచ్చినట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ తెలిపారు. ఇవాళ ద్రవ్య పరపతి కమిటీ నివేదికను ఆయన ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. 2వేల నోట్లను విత్డ్రా చేయడం వల్ల మొత్తం మీద కావాల్సినంత మిగులు నగదు ఉన్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఇక బ్యాంకింగ్ వ్యవస్థలోకి 2వేల నోట్లు 87 శాతం వచ్చేసినట్లు ఆయన తెలిపారు. తమ విశ్లేషణలు, అంచనాల ప్రకారం బ్యాంకింగ్ వ్యవస్థలో అదనపు నగదు ఉన్నట్లు వెల్లడించారు.
#WATCH | RBI Governor Shaktikanta Das says "Overall there is a surplus in liquidity due to the withdrawal of Rs 2000 bank notes. Till now 87% of all Rs 2000 notes are back" pic.twitter.com/5tknFTy1XN
— ANI (@ANI) August 10, 2023