WhatsApp | మెటా యాజమాన్యంలో వాట్సాప్‌కు ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున యూజర్లు ఉన్నారు. ఈ క్రమంలో ఎప్పటికప్పుడు యూజర్లను ఆకట్టుకునేందుకు కంపెనీ కొత్త కొత్త ఫీచర్లను పరిచయం చేస్తూ వస్తున్నది. గతేడాది ఏఐ సాంకేతికను జోడించి వాట్సాప్ రూపురేఖలనే మార్చేసింది. తాజాగా నూతన సంవత్సరంలో మరో మూడు ఫీచర్స్‌ను యూజర్లకు అందుబాటులోకి తీసుకురాబోతున్నది. మెటా ఏఐ ఫీచర్స్‌ను వాట్సాప్ సిద్ధం చేస్తున్నది. దీంతో వినియోగదారులకు మరింత సౌకర్యవంతంగా ఉండనున్నది.
మెటా ఏఐ షార్ట్‌కట్ : మెటా ఏఐ చాట్బాట్లో ఇన్స్టంట్ యాక్సెస్ కోసం షార్ట్‌కట్ బటన్‌పై వాట్సాప్ పని చేస్తుంది. ఈ బటన్ సహాయంతో యూజర్లు మెటా ఏఐని ఉపయోగించి వారి సమస్యలను సులభంగానే పరిష్కరించుకోవచ్చు. అవసరమైన సలహాలను సైతం పొందేందుకు వీలుంటుంది. ఈ బటన్ ప్రస్తుతం చాట్ల ట్యాబ్‌లో అందుబాటులో ఉంటుంది. ఇది విజిబిలిటీని పెంచడంతో పాటు యూజర్లు సులభంగా యాక్సెస్ చేయొచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్ ఐఓఎస్‌లో టెస్టింగ్ దశలో ఉంది. త్వరలోనే మిగతా యూజర్లందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
మెటా ఏఐకి మెసేజ్ ఫార్వర్డింగ్ : ప్రస్తుతం మెటా ఏఐకి మెసేజ్ ఫార్వర్డ్ చేసే ఫీచర్‌పై వాట్సాప్ పని చేస్తుంది. ఈ ఫీచర్లో యూజర్లు మెటా ఏఐకి ఏదైనా మీడియా లేదంటే మెసేజ్‌ను పంపుకోవచ్చు. టెక్ట్స్‌ను కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. స్పామ్ మెసేజ్‌లను చెక్ చేసుకొని చేసుకొని వెరిఫై చేసుకునేందుకు ఈ ఫీచర్ వినియోగదారులకు సహాయపడనున్నది. సరళంగా చెప్పాలంటే ఫ్యాక్ట్ చెకింగ్‌గా ఉపయోగపడనున్నది. ప్రస్తుతం ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ యూజర్లకు అభివృద్ధి చేస్తున్నది. త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
మెటా ఏఐ చాట్ మెమరీ : మెటా వాట్సాప్‌లో ఏఐని మరింత దగ్గర చేసుందుకు చాట్ మెమొరీ ఫీచర్‌ను తీసుకువస్తున్నది. దీంతో పర్సనల్ అసిస్టెన్స్ మెరుగవనున్నది. యూజర్లు ఏఐని అడిగిన ప్రశ్నలను గుర్తుంచుకుంటుంది. యూజర్లు ఏ సమయంలో ఏం తింటారు.. ఎలాంటి వస్తువులను ఇష్టపడుతున్నారనే.. అయిష్టాలు ఏమున్నాయనే అనే విషయాలను గుర్తుంచుకుంటుంది. ఎప్పటికప్పుడు సమాచారాన్ని గుర్తుంచుకొని.. ఎప్పుడైనా మళ్లీ ప్రశ్నలు అడిగిన సమయంలో డేటా సహాయంతో సమాధానం ఇస్తుంది.