Threads | మూడు వారాల్లో ‘థ్రెడ్స్’ పాపులారిటీ ఓవర్.. మెటా` క్లారిటీ మిస్సయిందా..
Threads | ట్విట్టర్’కు పోటీగా వచ్చిన థ్రెడ్స్ మూడు వారాల్లోనే చతికిల పడింది. ట్విట్టర్’తో పోలిస్తే వార్తలు, వివాదాంశాలపై పోస్టులపై థ్రెడ్స్’లో క్లారిటీ మిస్సయిందని తెలుస్తున్నది.
Threads | ట్విట్టర్‌కు ఆల్టర్నేటివ్గా మెటా ఈ నెల ఐదో తేదీన ‘థ్రెడ్స్’ యాప్ ప్రారంభించింది. కానీ, మూడు వారాల్లోనే దానికి యూజర్లలో ప్రజాదరణ శరవేగంగా తగ్గిపోయింది. మార్కెట్ ఇంటెలిజెన్స్ సంస్థ ‘సెన్సర్ టవర్’ అధ్యయనం ప్రకారం ప్రారంభంలో యూజర్లుగా చేరిన నెటిజన్లలో దాదాపు 75 శాతం మంది తగ్గిపోయారు.
ఫోర్బ్స్ నివేదిక ప్రకారం జూలై ఏడో తేదీన థ్రెడ్స్ యూజర్లు 4.4 కోట్ల మంది ఉంటే.. వారిలో రోజువారీ యాక్టివ్ యూజర్లు 1.3 కోట్ల మంది మాత్రమే. సెన్సర్ టవర్ కథనం ప్రకారం లాంచింగ్ రోజు యూజర్లు 19 నిమిషాలు థ్రెడ్స్’పై టైం స్పెండ్ చేస్తే.. ఇప్పుడది కేలం నాలుగు నిమిషాలకే పరిమితమైంది. ‘ఐఓఎస్’ యూజర్లు 19 నిమిషాల నుంచి నాలుగు నిమిషాల టైం మాత్రమే స్పెండ్ చేస్తుంటే.. ఆండ్రాయిడ్ యూజర్లు 21 నిమిషాల నుంచి ఐదు నిమిషాలకు పరిమితం అయ్యారు.
మార్కెట్లో ఆవిష్కరించిన వారం రోజుల్లో విజయవంతంగా దూసుకెళ్లిన ‘థ్రెడ్స్’ క్రమంగా యూజర్లను ఆకర్షించడంలో స్ట్రగుల్ అవుతోంది. గతేడాది ట్విట్టర్’ను టేకోవర్ చేసినప్పటి నుంచి చేసిన మార్పులతో యూజర్లు ఆల్టర్నేటివ్స్ కోసం మెటా ‘థ్రెడ్స్’ ప్రారంభించింది. యూజర్ల నుంచి పాజిటివ్ రియాక్షన్ కనిపించడంతో మొదట్లో ‘ట్విట్టర్’ కిల్లర్’గా థ్రెడ్స్’ను పరిగణించారు.
‘థ్రెడ్స్’ యాప్ ఏం చేస్తుంది.. దాని ప్రత్యేకతలు ఏమిటన్న విషయమై క్లారిటీ లేకపోవడంతో యూజర్ల మద్దతును పొందలేకపోతున్నది. న్యూ ప్లాట్‌ఫామ్’లోకి యూజర్లను ఆకర్షించడానికి ఇన్స్టాగ్రామ్ చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. దీంతో ట్విట్టర్, థ్రెడ్స్ యాప్స్ చాలా విభిన్నమైన యూజర్లను లక్ష్యంగా పని చేస్తున్నాయన్న అభిప్రాయాలు ఉన్నాయి.
వివిధ వివాదాస్పద అంశాలపై వార్తలు, రాజకీయాలకు, పేరొందిన జర్నలిస్టులు, సెలబ్రిటీలు, అథ్లెట్లు, రాజకీయ నాయకులు తమ వాయిస్ వినిపించడానికి ‘ట్విట్టర్’ను వేదికగా ఉపయోగించుకునే వారు. కానీ ఇన్‌స్ట్రాగ్రామ్ అండ్ థ్రెడ్స్ బాస్ ఆడమ్ మొస్సెరీ మాత్రం.. రాజకీయాలు, కఠినమైన వార్తల్లోకి తాము చొరబడాలని కోరుకోవడం లేదన్నారు. ప్రశ్నలు లేవెనెత్తే రాజకీయ కంటెంట్, వార్తలను ప్రోత్సహించేందుకు ‘థ్రెడ్స్’ నిరాసక్తంగా ఉంది. థ్రెడ్స్ కేవలం యూజర్ల సర్వీసుకే పరిమితం అవుతుందన్న
అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. లాంచింగ్ వీక్‌లో ‘థ్రెడ్స్’కు పది మంది యూజర్లు కనెక్ట్ అయ్యారు. కానీ ట్విట్టర్’కు 20 కోట్ల మంది యూజర్లు ఉంటే.. సగటున 30 నిమిషాలు టైం స్పెండ్ చేస్తున్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | రైతు వేదికల దగ్గరకు రండి అని రైతులతో ఆటలాడుతున్నారు.. అధికారులపై హరీశ్ రావు ఫైర్
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
Ranabaali | ట్రైలర్‌కి డుమ్మా కొట్టిన రష్మిక .. ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండతో కలిసి సందడి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

