న్యూఢిల్లీ: నవంబర్ 4: ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తూనే, మరో సంస్థలోనూ పనిచేసే ‘మూన్‌లైటింగ్’ ద్వారా వచ్చే ఆదాయంపై పన్ను పడుతుందని ఆదాయపు పన్ను అధికారులు, చార్టర్డ్ అకౌంటెంట్లు హెచ్చరిస్తున్నారు. మూన్‌లైటింగ్‌తో సమకూరే అదనపు ఆదాయాన్ని ఉద్యోగులు వారి ఐటీ రిటర్న్‌ల్లో వెల్లడించాలని వారు చెప్పారు. రెండు కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తుంటే, దానిని మూన్‌లైటింగ్‌గా వ్యవహరిస్తున్నారు.
టెక్నాలజీ, సాఫ్ట్వేర్ ఉద్యోగులు చేపడుతున్న మూన్‌లైటింగ్, లేదా ఉద్యోగులు రెగ్యులర్ జాబ్‌తో పాటు అదనపు ఆదాయం కోసం పార్ట్‌టైమ్ చేయడం పట్ల విప్రో, టీసీఎస్ తదితర టాప్ టెక్నాలజీ కంపెనీలు ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా తదితర కొన్ని కంపెనీలు మాత్రం తమకు తెలియపర్చి, మరో సంస్థకు పార్ట్‌టైమ్‌గా పనిచేసుకోవచ్చని ఉద్యోగులకు అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే. వ్యక్తి లేదా కంపెనీ కాంట్రాక్ట్ జాబ్‌కు రూ.30,000కు మించి చెల్లింపుచేస్తున్నా (ఐటీ చట్టం సెక్షన్ 194సీ), లేదా ప్రొఫెషనల్ ఫీజుగా చెల్లిస్తున్నా (సెక్షన్ 194) అందుకు వర్తించే రేటు మేరకు టీడీఎస్ (టాక్స్ డిడెక్షన్ ఎట్ సోర్స్) మినహాయించుకోవాలని తమిళనాడు, పాండిచ్ఛేరి, కేరళ చీఫ్ ఐటీ కమీషనర్ రవిచంద్రన్ తెలిపారు. ఈ ఆదాయాన్ని పొందినవారు ఐటీ రిటర్న్‌ల్లో డిక్లేర్ చేసి, టీడీఎస్ డిడెక్ట్ కాకపోతే.. వర్తించేరేటు మేరకు పన్ను చెల్లించాలి. మూన్‌లైటింగ్‌ను ప్రొఫెషనల్ సర్వీసుగా పరిగణిస్తారు.