Best Smart Phones | కొంత కాలంగా స్మార్ట్ ఫోన్ల సేల్స్ తగ్గుముఖం పడుతున్నా.. మొబైల్ ఫోన్ల తయారీ సంస్థలు కస్టమర్ల ఆకాంక్షలకు అనుగుణంగా కొత్తకొత్త ఫీచర్లతో సరికొత్త మోడల్ ఫోన్లు తీసుకొస్తున్నాయి. మే నెలలో మరికొన్ని స్మార్ట్ ఫోన్లు మార్కెట్లోకి రానున్నాయి. ఆ జాబితాలో పొకొ ఎఫ్5, శాంసంగ్ గెలాక్సీ ఎఫ్54, వన్ ప్లస్ నార్డ్3, గూగుల్ పిక్సెల్ 7ఏ, గూగుల్ పిక్సెల్ ఫోల్డ్, రియల్ మీ 11 ప్రో అండ్ ప్రో+ తదితర ఫోన్లు లాంచ్ కానున్నాయి. రియల్ మీ ప్రత్యేకంగా తన ఫోన్ 11 ప్రోలో 200 మెగా పిక్సెల్ కెమెరా ఫీచర్ అందుబాటులోకి తెస్తున్నది. ఈ ఫోన్లన్నీ విభిన్న సెగ్మెంట్ల పరిధిలోకి వస్తాయి. ఒకవేళ మీ ఆదాయానికి అనుగుణంగా ఏ సెగ్మెంట్ ఫోన్ కొనుక్కోవాలన్నా న్యూ ఆప్షన్లతో అందుబాటులో ఉన్నాయి. మీ బడ్జెట్‌కనుగుణంగా బెస్ట్ ఫోన్ సొంతం చేసుకోవచ్చు.
చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ పొకో మే తొమ్మిదో తేదీన తన ‘పొకో ఎఫ్5’ ఫోన్ భారత్ మార్కెట్లో ఆవిష్కరిస్తున్నది. ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ తో వస్తున్నది. భారత్ తోపాటు గ్లోబల్ మార్కెట్లోనూ అదే రోజు ఆవిష్కరిస్తున్నది పొకో. ఈ ఫోన్ ధర రూ.28 వేల నుంచి రూ.29 వేల మధ్య ఉండొచ్చునని మీడియా కథనాలు వెలువడ్డాయి.
మే నెలలో భారత్ మార్కెట్లోకి రానున్నది శాంసంగ్ గెలాక్సీ ఎఫ్54. ఇది మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్. అయితే, ఇప్పటికైతే శాంసంగ్ ఈ ఫోన్ లాంచింగ్ తేదీ వెల్లడించలేదు. మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం శాంసంగ్ గెలాక్సీ ఎఫ్54 ఫోన్లో ఎక్స్‌నోస్ ఎస్5ఈ8835 ప్రాసెసర్, 6.7 అంగుళాల ఫుల్ హెచ్ డీ + సూపర్ డిస్ ప్లే విత్ రీఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్ తో వస్తున్నది. 6000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ కూడా ఉంటుంది. 108-మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా గల ఈ ఫోన్ ధర రూ.24,990గా ఉండొచ్చు.
మే నెలాఖరులో భారత్ మార్కెట్లో వన్ ప్లస్ నార్డ్ 3 ఫోన్ లాంచింగ్ కానున్నది. మీడియా టెక్ డైమెన్సిటీ 9000 5జీ ప్రాసెసర్‌తో వస్తున్నది. ఈ ఫోన్ పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ విత్ 80వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తున్నది. భారత్‌లో ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.27,999 నుంచి మొదలవుతుంది.
సెర్చింజన్ గూగుల్ .. ఇండియాలో తన పిక్సెల్ 7ఏ, పిక్సెల్ ఫోల్డ్ ఫోన్లను మే 10న ఆవిష్కరించనున్నది. అదే రోజు గూగుల్ ఐ/ఓ 2023 డెవలపర్స్ కాన్ఫరెన్స్ మొదలు కానున్నది.
గూగుల్ పిక్సెల్ 7ఏ ఫోన్లో 6.1- అంగుళాల అమోల్డ్ డిస్ ప్లే విత్ 90 హెర్ట్జ్, 64-మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటాయి. పిక్సెల్ ఫోల్డ్ ఫోన్ 5.8 అంగుళాల కవర్ డిస్ ప్లే, 7.69 అంగుళాల మెయిన్ డిస్ ప్లే కలిగి ఉంటది. గూగుల్ పిక్సెల్ 7ఏ ఫోన్ రూ.45,990, ప్రీమియం స్మార్ట్ ఫోన్ పిక్సెల్ ఫోల్డ్ రూ.1.45 లక్షలు పలుకుతుంది.
చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియల్ మీ.. భారత్‌లో తన 11 ప్రో+, 11 ప్రో సిరీస్ ఫోన్ల ఆవిష్కరణ తేదీ ప్రకటించింది. రియల్ మీ 11 ప్రో ఫోన్ 108 మెగా పిక్సెల్ కెమెరా, 2-మెగా పిక్సెల్ కెమెరాలతో వస్తుంది. మీడియా టెక్ డైమెన్సిటీ 7000 ప్రాసెసర్‌తో వస్తుంది.
ఇక రియల్ మీ 11 ప్రో + ఫోన్ 6.7 అంగుళాల ఫుల్ హెచ్ డీ +, కర్వుడ్ అమోల్డ్ డిస్ ప్లేతో వస్తున్నది. 200-మెగా పిక్సెల్ + 8 మెగా పిక్సెల్ + 2 మెగా పిక్సెల్ కెమెరాలు ఉంటాయి. రియల్ మీ 11 ప్రో ఫోన్ రూ.28,990, రియల్ మీ 11 ప్రో + రూ.34,990లకు సొంతం చేసుకోవచ్చు.