న్యూఢిల్లీ, అక్టోబర్ 3: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్‌లో ద్రవ్యోల్బణం గరిష్ఠస్థాయిలోనే కొనసాగుతుందని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. సమీపకాలంలో ఆహారోత్పత్తుల ధరలు తగ్గినా, అంతర్జాతీయ పరిణామాల కారణంగా ద్రవ్యోల్బణం 5.9 శాతం మేర ఉంటుందని పేర్కొంది. రిజర్‌బ్యాంక్ నిర్దేశిత లక్ష్యమైన 4 శాతానికి ఇప్పట్లో దిగిరాదన్న సంకేతాల్ని ప్రపంచ బ్యాంక్ ఇచ్చింది. ఇక 2023-24లో భారత్ జీడీపీ వృద్ధి 6.3 శాతం ఉంటుందన్న అంచనాల్ని పునరుద్ఘాటించింది. ప్రపంచ అనిశ్చితి పరిస్థితులు ఉన్నా, దేశంలో సర్వీసుల రంగం జోరు కారణంగా మెరుగైన వృద్ధి రేటును సాధించగలుగుతుందని అంచనా వేసింది. ఈ ఏడాది ఏప్రిల్ రిపోర్ట్‌లో కూడా 6.3 శాతం వృద్ధి అంచనాల్నే ప్రపంచ బ్యాంక్ ప్రకటించింది.
2022-23లో భారత్ జీడీపీ 7.2 శాతం వృద్ధిచెందింది. అంతకంటే తక్కువ వృద్ధి అంచనాల్నే అంతర్జాతీయ ఏజెన్సీలైన ప్రపంచ బ్యాంక్, ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ)లు వెల్లడిస్తున్నాయి. ఇటీవల ఏడీబీ వెల్లడించిన రిపోర్ట్‌లో వృద్ధి రేటును 6.3 శాతానికి తగ్గించింది. రిజర్వ్‌బ్యాంక్ అంచనాల ప్రకారం 2023-24లో 6.5 శాతం వృద్ధి సాధ్యపడుతుంది. రేటింగ్ ఏజెన్సీలైన ఫిచ్ 6.3 శాతం, ఎస్ అండ్ పీ గ్లోబల్ 6.6 శాతం చొప్పున వృద్ధిని అంచనా వేస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్‌పై ప్రపంచ బ్యాంక్ తాజా నివేదిక వివరాలు..