వారమంతా లాభాల్లోనే.. భారీగా పెరిగిన స్టాక్ మార్కెట్ సూచీలు
స్టాక్ మార్కెట్లు వరుసగా ఎనిమిదో రోజు లాభాల్లో ముగిశాయి. బ్లూచిప్ సంస్థలైన హెచ్డీఎఫ్సీ బ్యాంక్, లార్సెన్ అండ్ టుబ్రో, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లకు మదుపరుల నుంచి లభించిన మద్దతుతో సూచీలు వారాంతం ట్రేడింగ్‌లోనూ లాభాల్లో ముగిశాయి.
ముంబై, సెప్టెంబర్ 8: స్టాక్ మార్కెట్లు వరుసగా ఎనిమిదో రోజు లాభాల్లో ముగిశాయి. బ్లూచిప్ సంస్థలైన హెచ్డీఎఫ్సీ బ్యాంక్, లార్సెన్ అండ్ టుబ్రో, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లకు మదుపరుల నుంచి లభించిన మద్దతుతో సూచీలు వారాంతం ట్రేడింగ్‌లోనూ లాభాల్లో ముగిశాయి. ఇంట్రాడేలో 500 పాయింట్లకు పైగా పెరిగిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు 333.35 పాయింట్ల లాభంతో 66,598.91 వద్ద ముగిసింది. నిఫ్టీ 92.90 పాయింట్లు ఎగబాకి 19,819.95 వద్ద ముగిసింది. గత ఆరు ట్రేడింగ్ సూచీల్లో నిఫ్టీ 473 పాయింట్లు లేదా మూడు శాతం లాభపడింది.
ఎన్టీపీసీ, టాటా మోటర్స్‌లు రెండు శాతానికి పైగా పెరిగి టాప్ గెయినర్‌గా నిలిచాయి.
ఎల్అండ్టీ, బజాజ్ ఫిన్సర్వ్, భారతీ ఎయిర్టెల్, టైటాన్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎస్బీఐ, రిలయన్స్, పవర్‌గ్రిడ్, హెచ్‌సీఎల్ టెక్నాలజీ, బజాజ్ ఫైనాన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, మారుతి, హెచ్‌యూఎల్, యాక్సిస్ బ్యాంక్, ఇన్ఫోసిస్, కొటక్ బ్యాంక్, మహీంద్రా షేర్లకు మదుపరుల నుంచి మద్దతు లభించింది.
మరోవైపు, అల్ట్రాటెక్ సిమెంట్, ఐటీసీ, విప్రో, టెక్ మహీంద్రా, టాటా స్టీల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టీసీఎస్, ఏషియన్ పెయింట్స్, సన్‌ఫార్మా, నెస్లెలు నష్టపోయాయి.
బీఎస్ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ ఇండెక్స్‌లు స్వల్పంగా లాభపడ్డాయి.
రంగాలవారీగా చూస్తే రియల్టీ 2.13 శాతం, క్యాపిటల్ గూడ్స్ 1.51 శాతం, పవర్ 1.49 శాతం. ఆయిల్ అండ్ గ్యాస్ 1.43 శాతం, కన్జ్యూమర్ డ్యూరబుల్ 1.35 శాతం, ఎనర్జీ 1.33 శాతం చొప్పున పెరిగాయి.
మొత్తంమీద ఈవారంలో సెన్సెక్స్ 878.4 పాయింట్లు(1.34 శాతం), నిఫ్టీ 384.65 పాయింట్లు(1.97 శాతం) చొప్పున పెరిగాయి.
‘అంతర్జాతీయ మార్కెట్లు పతనమైనప్పటికీ దేశీయ సూచీలు మాత్రం భారీగా పుంజుకుంటున్నాయి. అమెరికాలో నిరుద్యోగ గణాంకాల సూచీ విడుదలకానుండటం, ఆస్ట్రేలియాలో గ్యాస్ ధరలు పెరగడంతో గ్లోబల్ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపాయి. కానీ, ఐటీ, ఫార్మా, ఇన్ఫ్రా, క్యాపిటల్ గూడ్స్ రంగ షేర్లు జోరందుకోవడం సూచీలకు దన్నుగా నిలిచాయి.
– వినోద్ నాయర్, జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

