ముంబై, జనవరి 10: వరుసగా ఆరో రోజు రూపాయి పెరిగింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 10 పైసలు పెరిగి 83.03కి చేరుకున్నది. దేశ ఆర్థిక పరిస్థితులు ఆశాజనకంగా ఉండటంతో కరెన్సీకి ఊపునిచ్చింది. 83.13 వద్ద ప్రారంభమైన డాలర్-రుపీ రేటు ఒక దశలో 82.97 నుంచి 83.18 శ్రేణిలో కదలాడింది. చివరకు 10 పైసలు బలపడింది.