హైదరాబాద్, డిసెంబర్ 7: వర్క్, సోషల్ లైఫ్ ైస్టెల్ సేవల సంస్థ కోరం..తాజాగా హైదరాబాద్‌లో క్లబ్‌ను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించింది. రూ.35 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేస్తున్న ఈ క్లబ్ వచ్చే ఏడాది మధ్యనాటికి అందుబాటులోకి రానున్నట్లు కంపెనీ ఫౌండర్, సీఈవో వివేక్ నారైన్ తెలిపారు.
సంస్థకు ఇది మూడో క్లబ్‌ని, ఇప్పటికే గుర్గావ్, ముంబైల్లో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. నాలెడ్జ్ సిటీ డెవలప్మెంట్ సెంటర్లో 70 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ క్లబ్‌ను నెలకొల్పుతున్నది. వ్యాపార విస్తరణలో భాగంగా వచ్చే మూడు నుంచి నాలుగేండ్లలో మరో మూడు నగరాలకు తమ వ్యాపారాన్ని విస్తరించనున్నట్లు తెలిపింది.