Thyroid | ప్రసవానంతరం మహిళలకు వచ్చే థైరాయిడ్ సమస్యలకు కారణాలేంటి.. జీవితాంతం ఉంటాయా..?
ప్రసవం తర్వాత మహిళల్లో శరీరంలో అనేక హార్మోన్ల, రోగనిరోధక వ్యవస్థ మార్పులు చోటుచేసుకుంటాయి. ఈ సమయంలో థైరాయిడ్ పనితీరులో కూడా మార్పులు వస్తాయి. అయితే ప్రసవం తర్వాత థైరాయిడ్ సమస్య కనిపించిందంటే అది జీవితాంతం కొనసాగుతుందని భావించాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు.
Thyroid | ప్రసవం తర్వాత మహిళల్లో శరీరంలో అనేక హార్మోన్ల, రోగనిరోధక వ్యవస్థ మార్పులు చోటుచేసుకుంటాయి. ఈ సమయంలో థైరాయిడ్ పనితీరులో కూడా మార్పులు వస్తాయి. అయితే ప్రసవం తర్వాత థైరాయిడ్ సమస్య కనిపించిందంటే అది జీవితాంతం కొనసాగుతుందని భావించాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో ఇది తాత్కాలికంగా ఉండే పోస్ట్‌పార్టమ్ థైరాయిడిటిస్ అవుతుంది. రక్తపరీక్షల్లో ఈ సమస్య హషిమోటోస్ వ్యాధిని పోలి కనిపించే అవకాశం ఉండటంతో కొందరు మహిళలకు శాశ్వత థైరాయిడ్ సమస్యగా పొరపాటుగా నిర్ధారణ జరిగే అవకాశం ఉంటుంది. గర్భధారణ సమయంలో శిశువును రక్షించేందుకు మహిళ శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ సహజంగానే కొంత తక్కువగా చురుకుగా ఉంటుంది. ప్రసవం తర్వాత అది మళ్లీ సాధారణ స్థాయికి చురుకుగా మారే సమయంలో కొంతమంది మహిళల్లో రోగనిరోధక ప్రతిస్పందన అధికంగా మారి థైరాయిడ్ గ్రంథిలో వాపులకు దారితీస్తుంది. దాదాపు ప్రతి పది మంది మహిళల్లో ఒకరికి ఈ విధమైన పోస్ట్‌పార్టమ్ థైరాయిడిటిస్ వచ్చే అవకాశం ఉందని నిపుణుల వివరణలో పేర్కొన్నారు.
అందరికీ ఒకేలా ఉండవు..
ప్రసవం తర్వాత థైరాయిడ్ సమస్యకు సంబంధించిన లక్షణాలు ఒకే విధంగా ఉండవు. సాధారణంగా ఇది వివిధ దశల్లో కనిపిస్తుంది. మొదటి దశలో థైరాయిడ్ హార్మోన్లు అధికంగా విడుదల అవుతాయి. ఈ సమయంలో మహిళలు అలసటగా ఉన్నప్పటికీ, అదే సమయంలో అసహనంగా లేదా అధిక ఉత్సాహంతో ఉన్నట్లుగా అనిపిస్తుంది. నిద్ర సరిగా పట్టకపోవడం, ఒత్తిడిగా అనిపించడం, జుట్టు రాలడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. అయితే కొత్తగా తల్లైన మహిళల్లో సాధారణంగా కనిపించే అలసట లేదా ఒత్తిడిగానే వీటిని భావించే అవకాశం ఉంటుంది. రెండో దశలో థైరాయిడ్ హార్మోన్ల స్థాయిలు తగ్గుతాయి. అప్పుడు తీవ్రమైన అలసట, ఎప్పుడూ శక్తి లేనట్లుగా అనిపించడం, భావోద్వేగంగా నీరసంగా ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇవి ప్రసవానంతర డిప్రెషన్ లక్షణాలను పోలి ఉండటంతో అసలు కారణాన్ని గుర్తించడం కొన్నిసార్లు కష్టమవుతుంది. అందుకే ప్రసవం తర్వాత ఇలాంటి లక్షణాలు కొనసాగితే వాటిని కేవలం ప్రసవం వల్ల వచ్చిన అలసటగా భావించకుండా వైద్యుల సలహాతో పరీక్షలు చేయించుకోవడం అవసరం.
టీపీవో యాంటీ బాడీలు..
అయితే ప్రతి మహిళలో ఈ సమస్య జీవితాంతం కొనసాగదు. చాలా మందిలో మూడో దశలో థైరాయిడ్ పనితీరు క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటుంది. అలాంటి సందర్భాల్లో జీవితాంతం థైరాయిడ్ మందులు తీసుకోవాల్సిన అవసరం ఉండదు. కానీ కొంతమంది మహిళల్లో మాత్రం థైరాయిడ్ సమస్య శాశ్వతంగా మారే అవకాశం ఉంటుంది. అందుకే ప్రసవం తర్వాత థైరాయిడ్ సమస్యను గుర్తించిన వెంటనే అది జీవితాంతం ఉంటుందని నిర్ణయించకుండా, నిరంతర పర్యవేక్షణతో పరిస్థితిని అంచనా వేయడం ముఖ్యం. థైరాయిడ్ పెరోక్సిడేజ్ (TPO) యాంటీబాడీల స్థాయి ఈ విషయంలో ఒక ముఖ్యమైన సూచికగా ఉంటుంది. గర్భధారణ ప్రారంభ దశలోనే TPO యాంటీబాడీలను పరీక్షించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. TPO యాంటీబాడీలు అధికంగా ఉన్న మహిళల్లో భవిష్యత్తులో శాశ్వత థైరాయిడ్ సమస్య ఏర్పడే అవకాశం సుమారు ముగ్గురిలో ఒకరికి ఉంటుంది. ప్రసవానంతర కాలంలో శరీరంలో హార్మోన్లు, రోగనిరోధక వ్యవస్థలో పెద్ద మార్పులు చోటుచేసుకుంటాయి. అందువల్ల ఈ సమయంలో కనిపించే థైరాయిడ్ సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా సరైన రక్తపరీక్షలు, వైద్యుల పర్యవేక్షణతో పరిస్థితిని అర్థం చేసుకోవాలి. ప్రసవం తర్వాత వచ్చిన ప్రతి థైరాయిడ్ సమస్య హషిమోటోస్ వ్యాధి లేదా జీవితాంతం కొనసాగే సమస్య అని భావించకుండా, అది తాత్కాలికమా లేదా శాశ్వతమా అనేది పరీక్షలు, కాలానుగుణ పర్యవేక్షణ ద్వారా నిర్ధారించుకోవడం మంచిదని నిపుణులు తెలియజేస్తున్నారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road Accident | కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదంపై మంత్రుల సంతాపం..బాధిత కుటుంబాలను ఆదుకుంటాం
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ ఆరోగ్యంపై ఆందోళన.. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచన!
Jailer 2 | 200 మంది అమ్మాయిలతో ‘తలైవా’ డ్యాన్స్.. థియేటర్లలో ఆ సీన్స్ మిస్!
Ranabaali | రణబాలి బాక్సాఫీస్ సెన్సేషన్.. వర్కింగ్ డేలోనూ అదరగొట్టిన విజయ్ దేవరకొండ!
Rowdy-sheeter | పోలీసింగ్ ఎక్కడ? ఏం చేస్తారో చేసుకోండన్న యువకుడు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

