Express Hari | బుల్లితెరపై తనదైన కామెడీ టైమింగ్, పంచులు, ప్రాసలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్ ఎక్స్‌ప్రెస్ హరి గురించి ప్రస్తుతం ఓ ఆసక్తికరమైన చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది. త్వరలోనే హరి పెళ్లి చేసుకోబోతున్నాడా? ఆయన జీవితంలో కొత్త అధ్యాయం మొదలు కాబోతుందా? అనే ప్రశ్నలు నెటిజన్లలో ఆసక్తిని పెంచుతున్నాయి.ఎక్స్‌ప్రెస్ హరి తొలుత ‘పటాస్’ కార్యక్రమం ద్వారా స్టాండప్ కమెడియన్‌గా తన కెరీర్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత ‘జబర్దస్త్’ కామెడీ షోలోకి వచ్చి తనదైన కామెడీ పంచులతో ప్రేక్షకులకు దగ్గరయ్యారు. కేవలం కమెడియన్‌గానే కాకుండా నటుడిగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. హరిలో మరో టాలెంట్ కూడా ఉంది. ఆయన మంచి రచయిత కూడా. ప్రస్తుతం నటుడిగా కొనసాగుతూనే పలు టీవీ కార్యక్రమాలకు స్క్రిప్టులు, డైలాగ్స్ అందిస్తూ బిజీగా ఉన్నారు.
ప్రస్తుతం ఎక్స్‌ప్రెస్ హరి రచయితగా, కమెడియన్‌గా పనిచేస్తున్న ‘ఆదివారం విత్ స్టార్ మా పరివారం’ కార్యక్రమం 200 ఎపిసోడ్ల మైలురాయిని చేరుకుంది. ఈ ప్రత్యేక ఎపిసోడ్‌ను మరింత గ్రాండ్‌గా నిర్వహించేందుకు మేకర్స్ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా విడుదల చేసిన ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ముఖ్యంగా ఈ ప్రోమోలో యాంకర్ శ్రీముఖి చేసిన ఓ ప్రకటన అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రోమోలో శ్రీముఖి ఓ బిగ్ సర్ప్రైజ్ ఇవ్వబోతున్నట్లు ప్రకటించింది. ఎక్స్‌ప్రెస్ హరి త్వరలోనే ఇండస్ట్రీకి చెందిన ఓ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడని ఆమె చెప్పడం కనిపించింది. అంతేకాదు.. ఆ తర్వాత పల్లకిలో ఓ యువతిని పెళ్లికూతురిలా తీసుకురావడం, ఆమె ముఖానికి ముసుగు ఉండటం, ఆమెను చూసి ఎక్స్‌ప్రెస్ హరి సిగ్గుపడుతున్నట్లుగా చూపించడం ఆసక్తిని మరింత పెంచింది.
అయితే ఆ ముసుగు వెనుక ఉన్న అమ్మాయి ఎవరు? ఆమె నిజంగానే హరి కాబోయే భార్యేనా? అన్న విషయాన్ని ప్రోమోలో మాత్రం వెల్లడించలేదు. ఇదే ఇప్పుడు నెటిజన్లలో చర్చకు కారణమైంది. కొంతమంది హరి నిజంగానే పెళ్లి చేసుకోబోతున్నారని భావిస్తున్నారు. ముఖ్యంగా 200వ ఎపిసోడ్ వంటి ప్రత్యేక కార్యక్రమంలో ఇలాంటి ప్రకటన రావడంతో ఇది నిజమైన పెళ్లి వ్యవహారమే కావచ్చని అంటున్నారు. మరోవైపు మరికొందరు మాత్రం ఇది కేవలం షోపై ఆసక్తి పెంచేందుకు చేసిన టీఆర్పీ ప్రమోషన్ కావచ్చని అభిప్రాయపడుతున్నారు. టీవీ కార్యక్రమాల్లో ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచేందుకు లవ్ ట్రాక్స్, పెళ్లి సన్నివేశాలు, సర్ప్రైజ్ ఎలిమెంట్స్‌ను ఉపయోగించడం సాధారణమేనని వారు గుర్తుచేస్తున్నారు. ప్రోమోలో పెళ్లికూతురి ముఖాన్ని చూపించకపోవడంతో అసలు సస్పెన్స్ మొదలైంది. ఆమె టీవీ ఇండస్ట్రీకి చెందిన నటేనా? సీరియల్ నటి లేదా మరెవరైనా సెలబ్రిటీనా? లేక ఇదంతా షోలో భాగంగా రూపొందించిన సన్నివేశమేనా? అన్నది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం మాత్రం ‘ఎక్స్‌ప్రెస్ హరి పెళ్లి’ అనే విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అసలు నిజం ఏంటో తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ ప్రసారం అయ్యే వరకు వేచి చూడాల్సిందే.