పాపన్నపేట, ఆగస్టు 23 : మెదక్ జిల్లా పాపన్నపేటలోని ఏడుపాయల వన దుర్గమ్మ ఆలయం ఆదివారం వేలాది భక్తు లతో జనసంద్రంగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు మంజీరా పాయల్లో స్నానాలు చేసి, అమ్మవారిని దర్శిం చుకున్నారు. అర్చకులు శంకరశర్మ, పార్థివ శర్మ దుర్గమ్మకు పూజలు చేసి, భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఒడిబియ్యం పోసి, బోనాలు తీసి భక్తులు మొక్కులు చెల్లించుకు న్నారు. భక్తులకు ఇబ్బంది కలుగకుండా ఆలయ సిబ్బంది సూర్య శ్రీనివాస్, మధుసూదన్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, నర్సింలు, బత్తిని రాజు, బ్రహ్మచారి, యాదగిరి నరేష్ తదితరులు ఏర్పాట్లు చేశారు. పోలీ సులు బందోబస్తు చర్యలు చేపట్టారు.