Electric Bike Price | ఈవీ టూవీలర్స్ ప్రియం.. రూ.22 వేల దాకా పెంచేసిన కంపెనీలు
Electric Bike Price | విద్యుత్తు ఆధారిత ద్విచక్ర వాహనాల ధరలు భారీగా పెరిగాయి. ఒక్కో వాహనం ధర గరిష్ఠంగా రూ.22వేల వరకు పెరగడం గమనార్హం. ఇన్నాళ్లూ ఎలక్ట్రిక్ టూవీలర్స్ తయారీదారులకు ఇచ్చిన సబ్సిడీకి కేంద్ర ప్రభుత్వం కోత పెట్టడమే ఇందుకు కారణం. దేశంలో ప్రమాదకర స్థాయిలో పెరిగిన వాతావరణ కాలుష్యాన్ని అరికట్టడం..
Electric Bike Price | న్యూఢిల్లీ, జూన్ 1: విద్యుత్తు ఆధారిత ద్విచక్ర వాహనాల ధరలు భారీగా పెరిగాయి. ఒక్కో వాహనం ధర గరిష్ఠంగా రూ.22వేల వరకు పెరగడం గమనార్హం. ఇన్నాళ్లూ ఎలక్ట్రిక్ టూవీలర్స్ తయారీదారులకు ఇచ్చిన సబ్సిడీకి కేంద్ర ప్రభుత్వం కోత పెట్టడమే ఇందుకు కారణం. దేశంలో ప్రమాదకర స్థాయిలో పెరిగిన వాతావరణ కాలుష్యాన్ని అరికట్టడం.. పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించడంలో భాగంగా మోదీ సర్కారు విద్యుత్తు ఆధారిత వాహన అమ్మకాలను ప్రోత్సహిస్తూ వచ్చిన విషయం తెలిసిందే.
అయితే ఇందుకు సంబంధించి తెచ్చిన (ఫాస్టర్ అడాప్షన్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ అండ్ హైబ్రిడ్ వెహికిల్స్ (ఫేమ్) 2 పథకంలో ఇప్పుడు సవరణలు చేసింది. ఈ మార్పులు గురువారం నుంచే అమల్లోకి రాగా.. ఇప్పటిదాకా అందిన రాయితీలు భారీగా తగ్గిపోతున్నాయి. ఫలితంగా ఈ భారాన్ని ఆయా సంస్థలు వినియోగదారులపైనే మోపేందుకు సిద్ధమయ్యాయి. ఈ క్రమంలోనే టీవీఎస్ మోటర్ కంపెనీ, ఏథర్ ఎనర్జీ, ఓలా ఎలక్ట్రిక్ కంపెనీలు తమ ఎలక్ట్రిక్ టూవీలర్ల ధరలను ఆ మేరకు పెంచేశాయి.
- వేరియంట్‌నుబట్టి రూ.17,000-22,000 మధ్యలో పెరిగిన టీవీఎస్ ఎలక్ట్రిక్ టూవీలర్ ధర
- గతంలో టీవీఎస్ ఐక్యూబ్ బేస్ ధర (ఢిల్లీ) రూ.1,06,384, ఎస్ ట్రిమ్స్ ధర రూ.1,16,886. ఇప్పుడు వీటీ కోసం మరో రూ.22,000 వరకు కొనుగోలుదారులు అదనంగా చెల్లించాలి
- ఏథర్ ఎనర్జీ 450ఎక్స్ ప్రారంభ ధర (బెంగళూరు ఎక్స్‌షోరూం) ఇప్పుడు రూ.1,45,000. 450ఎక్స్ ప్రో ప్యాక్ ప్రారంభ ధర రూ.1,65,435. దాదాపు రూ.8,000 పెరిగాయి
- ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఎస్1 ప్రో ధర ఇప్పుడు రూ.1,39,999. ఎస్1 (3కిలోవాట్స్) ధర రూ.1,29,999, ఎస్1 ఎయిర్ (3కిలోవాట్స్) ధర రూ.1,09,999. గతంతో పోల్చితే సుమారు రూ.15,000 అధికం
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

