న్యూఢిల్లీ, జూలై 9: దేశీయ మార్కెట్లో ఎస్యూవీ విభాగంలో పోటీని మరింత తీవ్రతరం చేయాలనే ఉద్దేశంతో ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం నిస్సాన్ మోటర్ ఇండియా..మరో ఎస్యూవీ మాడల్‌ను తీసుకొచ్చింది. సరికొత్త నిస్సాన్ టెక్టాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ కారు రూ.10.49 లక్షలు ప్రారంభ ధరతో..గరిష్ఠంగా రూ.18.59 లక్షలుగా నిర్ణయించింది. 100 శాతం టర్బోచార్జ్డ్ ఇంజిన్‌తో తయారైన ఈ కారు 19.4 కిలోమీటర్ల మైలేజీ ఇవ్వనున్నది.
10.1 ఇంచులు, 10.25 ఇంచుల డ్యూయల్ హెచ్డీ స్క్రీన్, నావిగేషన్, పానోరమిక్ సన్‌రూఫ్, ఇంటిలిజెంట్ ైక్లెమెట్ కంట్రోల్, డ్యాష్‌బోర్డ్ కెమెరా, 360 డిగ్రీల పార్కింగ్ అసిస్ట్, వైర్లెస్ చార్జింగ్ పాయింట్, భద్రతా ప్రమాణాలు మెరుగుపర్చడంలో భాగంగా ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, 40కి పైగా స్టాండర్డ్ భద్రతా ఫీచర్లతో తీర్చిదిద్దింది.