న్యూఢిల్లీ, ఆగస్టు 18: దేశీయ మార్కెట్లోకి అపడేటెడ్ కాంప్యాక్ట్ సెడాన్ అమేజ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది హోండా కార్స్ ఇండియా. పెట్రోల్, డీజిల్ ఇంజిన్ కలిగిన ఈ కారు రూ.6.23 లక్షల నుంచి రూ.11.15 లక్షల మధ్యలో లభించనున్నది. 1.2 లీటర్ల పెట్రోల్ ఇంజిన్ కలిగిన కారు రూ.6.32 లక్షల నుంచి రూ.9.05 లక్షల లోపు లభించనుండగా, 1.5 లీటర్ల డీజిల్ ఇంజిన్ కలిగిన కారు రూ.8.66 లక్షల నుంచి రూ.11.15 లక్షల ధరను నిర్ణయించింది. లీటర్ పెట్రోల్‌కు 18.6 కిలోమీటర్లు, డీజిల్ కారు 24.7 కిలోమీటర్ల మైలేజీ ఇవ్వనున్నది.