Home
Business
The Gst Council Has Rationalized The Penalties For Offenses Related To The Goods And Services Tax
జీఎస్టీ ఎగవేత శిక్ష హేతుబద్ధం.. జైలు లేదా జరిమానా.. వీలైతే రెండూ: సీబీఐసీ
వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)కు సంబంధించిన నేరాల్లో శిక్షలను జీఎస్టీ కౌన్సిల్ హేతుబద్ధం చేసింది. జైలు లేదా జరిమానా.. వీలైతే రెండూ ఉంటాయని ప్రకటించింది.
న్యూఢిల్లీ, అక్టోబర్ 9 : మునుపు జైలు, జరిమానా రెండూ ఉండేవి. కాగా, రూ.10 కోట్లకుపైగా పన్ను ఎగవేత కేసుల్లో జైలు శిక్ష ఐదేండ్లదాకా లేదా జరిమానా లేకుంటే రెండూ పడనున్నాయి. అలాగే రూ.5-10 కోట్ల కేసుల్లో రెండేండ్లదాకా జైలు లేదా జరిమానా లేకుంటే రెండూ ఉంటాయి. ఈ మేరకు గురువారం జరిగిన 57వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు పరోక్ష పన్నులు, కస్టమ్స్ కేంద్ర బోర్డు (సీబీఐసీ) తరచుగా అడిగే ప్రశ్నల్లో జవాబుగా తెలిపింది.
‘ఎవరికైనా శిక్ష పడితే జైలు తప్పనిసరేమీ కాదు’ అని వివరించింది. ఈ నిర్ణయాలు వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. కాగా, జీఎస్టీ ఎగవేత కేసుల్లో నేర విచారణకున్న పరిమితిని కోటి రూపాయల నుంచి రూ.5 కోట్లకు తాజా కౌన్సిల్ భేటీలో పెంచిన సంగతి విదితమే.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

