హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ) : దేశంలో పునరుత్పాదక ఇంధన రంగాన్ని మరింత వేగంగా అభివృద్ధి చేయడంతో పాటు, క్లీన్ ఎనర్జీ చర్యలను వేగవంతం చేయాలని కేంద్రం సూచించింది. 2030 కల్లా 500 గిగావాట్ల ఇంధన సామర్థ్యాన్ని సాధించేందుకు చర్యలు చేపట్టాలన్నది.
భారత్ రెన్యువబుల్ ఎనర్జీ సమ్మిట్ అండ్ ఎక్స్పోను సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించారు. జైపూర్, ముంబైల్లో ఈ రోడ్‌షోను నిర్వహించగా.. అహ్మదాబాద్, లక్నో, బెంగళూరు, కోల్‌కతాలో ఈ రోడ్‌షోలను నిర్వహించనున్నారు. తెలంగాణ రెడ్కో వీసీ అండ్ ఎండీ ముషారఫ్ ఫారూకీ పాల్గొని ప్రసంగించారు.